Peddapalli Doctor Humanity: మానవత్వం ఈ డాక్టర్ రూపంలో బతికే ఉంది, కోవిడ్-19 మృతదేహాన్ని ట్రాక్టర్‌లో వేసుకుని స్మశానానికి తీసుకువెళ్లిన పెద్దపల్లి డాక్టర్, వైరల్ అవుతున్న వీడియో
Telangana doctor turns driver to shift COVID victim's body. (Photo Credits: IANS)

Hyderabad, July 14: కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలు దుర్భరంగా మారాయి. బతుకు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే కేసుల కంష్య కోటి 50 లక్షలకు చేరువలో ఉన్నాయి. కరోనా దెబ్బకు మానవత్వం అనేది కరువయింది. ఇలాంటి సమయంలో అప్తులు మరణించినా దగ్గరుండి వారి అంత్యక్రియలు కూడా నిర్వహించలేని పరిస్థితి. మరణించిన వ్యక్తికి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాని స్థితి. ఇలాంటి సమయంలో తెలంగాణలోని (Telangana) పెద్దపల్లి జిల్లాకు చెందిన ఒక డాక్టర్ మానవత్వానికి (Humanity) ప్రతీకగా నిలిచాడు.తెలంగాణలో కొత్తగా 1550 పాజిటివ్ కేసులు, రాష్ట్రంలో 36 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, మరో హాట్‌స్పాట్‌గా మారిన కరీంనగర్

వివరాల్లోకెళితే.. పెద్దపల్లి జిల్లాలో (Peddapalli District) తెనుగు వాడకు చెందిన ఓ వ్యక్తికి ఈనెల 10న పాజిటివ్ (Coronavirus) వచ్చింది. మెడికల్ సిబ్బంది షుగర్ ఉన్నట్టు గుర్తించి, కాంటాక్ట్ అయిన వ్యక్తుల వివరాలు తీసుకున్నారు. షుగర్ ఉందని తెలిసి హోమ్ ఐసోలేషన్ లోనే ఉండాలని సూచించారు. దీంతో రెండు రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఆదివారం ఉదయం శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో కుటుంబ సభ్యులు 108లో పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో అతడు చనిపోయాడు.

Here's ANI Video

క‌రోనాతో మ‌ర‌ణించిన డెడ్ బాడీని స్మశానానికి తీసుకెళ్లేందుకు మున్సిప‌ల్ సిబ్బంది ఒప్పుకోలేదు. గంటపాటు ఎదురు చూసినా ఎవ‌రు సాయం చేయ‌క‌పోవ‌డంతో డాక్ట‌రే స్వ‌యంగా ముందుకు వచ్చారు. మరణించిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించడానికి , అతని మృతదేహం తరలించడానికి ఒక ట్రాక్టర్‌ను మాట్లాడారు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ కరోనాకు భయపడి తాను డ్రాక్టర్ నడపనని చెప్పడంతో విధుల్లో ఉన్న డాక్టర్ శ్రీరామ్ మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తీసుకుని స్మశానానికి తీసుకెళ్లారు. కాగా పెద్ద‌ప‌ల్లి జిల్లాలో 50 మంది కరోనా పేషెంట్లు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ యీడియాలో వైరల్ అవుతోంది. డాక్టర్ శ్రీరామ్ మంచి మనసును, అతని మానవత్వ చొరవను అందరూ మెచ్చుకుంటున్నారు.

Here's Harish Rao Thanneeru Tweet

వీడియో వైరల్ అయిన తరువాత జిల్లా కరోనా ప్రత్యేకాధికారి డాక్టర్‌ పెండ్యాల శ్రీరాంపై రాష్ట్రవ్యాప్తంగా నాయకులు, అధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. మంత్రి హరీశ్‌రా వు సోమవారం ట్విట్టర్‌ ద్వారా ఆయనకు అభినందనలు తె లిపారు. కరోనాపై యుద్ధంలో స్ఫూర్తిదాయకంగా నిలిచారని, మానవత్వం బతికే ఉంది, మానవత్వంలో దైవత్వం దర్శించుకునేలా చేశారన్నారు.

శ్రీరాం సేవలను తెలుసుకున్న వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సైతం ప్రశంసించారు. జిల్లా అధికారులు సంఘం సభ్యులు జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్‌ రాజన్న, జిల్లా సహకారాధికారి చంద్ర ప్రకాశ్‌రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి వినోద్‌కుమార్, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌లు అభినందించారు.