Hyderabad, July 13: తెలంగాణలో ఈరోజు కూడా భారీగానే కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 1550 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 36,221 కి చేరుకుంది.
ఎప్పట్లాగే హైదరాబాద్ లో ఎక్కువగానే కేసులు నమోదయినప్పటికీ, ఇప్పుడు ఇతర జిల్లాల్లో కూడా కేసులు భారీగా పెరగడం ప్రజలను కొంత ఆందోళనకు గురిచేసే విషయం. సోమవారం నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 926 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది.
ఇక నగరానికి సమీప ప్రాంతమైన రంగారెడ్డి జిల్లా నుంచి ఈరోజు అత్యధికంగా 212 కేసులు రాగా, మేడ్చల్ నుంచి 53, సంగారెడ్డి నుంచి 19 పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి. అయితే కరీంనగర్ జిల్లాలో ఇటీవల కాలంలోనే ఎప్పుడూ లేనంతగా 86 కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ ను పరిగణలోకి తీసుకుని పెద్దపల్లి 6, సిరిసిల్ల 7 నుంచి నమోదైన కేసులనూ కలుపుకుంటే మొత్తంగా ఈ ఒక్కరోజే 99 పాజిటివ్ కేసులు నమోదైనట్లు స్పష్టమవుతోంది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా COVID19కు మరో హాట్‌స్పాట్‌గా మారినట్లయింది. రాబోయే రోజులు మరింత ప్రమాదకరం, భవిష్య వాణిని వినిపించిన అమ్మవారు
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
TS's COVID Bulletin:
మరోవైపు గత 24 గంటల్లో మరో 9 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 365 కు పెరిగింది.
అలాగే, సోమవారం సాయంత్రం వరకు మరో 1197 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 23,679 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,178 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
గత 24 గంటల్లో 11,525 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,81,849 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.