Telangana Shocker: పెళ్లైనా బాయ్‌ఫ్రెండ్‌ని మరచిపోలేని యువతి, కలిసి బతకలేమనే బెంగతో రైలు పట్టాల కిందపడి ఆత్మహత్య, యాదగిరి గుట్టలో విషాద ఘటన
బహుపేట రైల్వే గేటు సమీపంలో (rail tracks in Yadagirigutta) రైలు కిందపడి ఈ యువజంట ఆత్మహత్యకు (lovers found dead) పాల్పడింది.
Yadagirigutta, Nov 9: తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ప్రేమజంట ( Man, woman suspected to be lovers) ఆత్మహత్య కలకలం రేపింది. బహుపేట రైల్వే గేటు సమీపంలో (rail tracks in Yadagirigutta) రైలు కిందపడి ఈ యువజంట ఆత్మహత్యకు (lovers found dead) పాల్పడింది. గుర్తించిన రైల్వే సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను భువనగిరి మండలం బస్వాపూర్‌కు చెందిన ఉడుతల గణేశ్ (25), నలంద (23)గా గుర్తించారు.
కాగా, మృతురాలు నలందకి మూడేండ్ల క్రితం యాదగిరిగుట్టకు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. అయితే.. గణేష్‌తో అంతకు ముందు నుంచే ఆమెకు ప్రేమ వ్యవహారం నడిచింది. విడిపోయి బతకడం ఇష్టం లేకే ఈ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. యాదగిరిగుట్టపై విధులు నిర్వహిస్తున్న అతడు రాత్రి 11 గంటల సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూడగా.. తన భార్య కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బహుపేట రైల్వే పట్టాల వద్ద మృతదేహాలను గమనించిన రైల్వే సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి 2.30 గంటల సమయంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.