![](https://test1.latestly.com/wp-content/uploads/2022/10/rape1.jpg)
Hyd, Nov 8: హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన (Hyderabad Shocker) చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్లు బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన నవంబర్ 5వ తేదీన మీర్‌పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లెనిన్‌నగర్‌కు చెందిన బాధితురాలు.. తన రాత్రి సమయంలో తన స్నేహితురాలి ఇంటికి వెళ్తుండగా అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు ఆమెను కిడ్నాప్ (minor Girl allegedly kidnapped) చేశారు. అనంతరం, నోరు నొక్కిపట్టి బైక్‌పై ఎక్కించుకుని బడంగ్‌పేట్‌లోని ప్రభుత్వ పాఠశాల వెనుకకు తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడియత్నం (sexually assaulted) చేశారు. ఈ క్రమంలో బాలిక కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. స్థానికుల రాకను గమినించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
అయితే, లైంగికయత్నంలో నిందితులు.. బాధితురాలిని బెదిరింపులకు గురిచేసినట్టు తెలుస్తోంది. తమ గురించి ఎవరికైని చెబితే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చినట్టు బాధితురాలు పేర్కొంది. ఈ ఘటనపై బాధితురాలు, ఆమె పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.