Telangana Shocker: మైలార్‌దేవ్‌పల్లిలో గంజాయి బ్యాచ్ అరాచకం, బాలుడి బట్టలు విప్పి బెల్ట్,కర్రలతో తీవ్రంగా కొడుతూ చిత్రహింసలు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో ఓ గంజాయ్ బ్యాచ్ ఓ బాలుడి (17) ని ( Minor Boy ) చిత్రహింసలకు గురిచేసింది.గంజాయి మత్తులో ఈ బ్యాచ్ మైనర్ బాలుడిపై దారుణంగా దాడి (Minor Boy Assaulted by Ganja gang)చేశారని పోలీసులు తెలిపారు

Representational image (photo credit- IANS)

Hyd, Mar 2: తెలంగాణలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో ఓ గంజాయ్ బ్యాచ్ ఓ బాలుడి (17) ని ( Minor Boy ) చిత్రహింసలకు గురిచేసింది.గంజాయి మత్తులో ఈ బ్యాచ్ మైనర్ బాలుడిపై దారుణంగా దాడి (Minor Boy Assaulted by Ganja gang)చేశారని పోలీసులు తెలిపారు. డబ్బులు ఇవ్వనందుకు యువకుడిని తీసుకెళ్లి చితకబాదినట్లు బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పీకల దాకా తాగిన పోలీస్ కానిస్టేబుల్‌, అర్థరాత్రి రోడ్డు మీద అసభ్యకరంగా తిడుతూ వసూలు దందాలు, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన శంషాబాద్‌ పోలీసులు

బాధితుడి తల్లిదండ్రులు, పోలీసులు ప్రకారం.. కిరాణా దుకాణంలో కూర్చున్న యువకుడిని గంజాయ్ బ్యాచ్ డబ్బులు అడిగింది. అయితే బాలుడు డబ్బులు ఇవ్వకపోవడంతో సమీపంలోని గుట్టల వద్దకు తీసుకెళ్లారు. అనంతరం గంజాయికి డబ్బులు ఇవ్వాలంటూ బాలుడి బట్టలు విప్పి బెల్ట్, కర్రలతో తీవ్రంగా కొడుతూ చిత్రహింసలు పెట్టారు. ఈ క్రమంలో అర్ధరాత్రి గంజాయి గ్యాంగ్‌ నుంచి ఎలాగో తప్పించుకొని బాలుడు తన ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. ఒంటిపై గాయాలను చూసిన బాలుడి కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ప్రమోషన్ కోసం భర్త పాడు పని, బాస్ పక్కలో పడుకోవాలంటూ భార్యకు వేధింపులు, కోర్టును ఆశ్రయించిన బాధితురాలు

ఈ విషయంపై బాలుడి తల్లిదండ్రులు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహమ్మద్ సైఫ్, అబ్బూ, సమీర్‌తోపాటు మరో ఐదుగురిపై బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంజాయి బ్యాచ్ కోసం వేట మొదలుపెట్టారు. నీకు దిక్కున్న చోట చెప్పుకో, ఇప్పటికే ఇద్దరిని హత్య చేశాం అని గంజాయి గ్యాంగ్‌ సభ్యులు బాలుడిని బెదిరించినట్లు సమాచారం