SSC Exams Starts Today: తెలంగాణలో నేటి నుంచే పదో తరగతి పరీక్షలు.. ఎగ్జామ్స్ రాయనున్న 4.94 లక్షల మంది విద్యార్థులు

తెలంగాణలో నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 4,85,826 మంది. 8,632 మంది ఒకసారి తప్పినవారు కాగా, ఓరియంటల్ విద్యార్థులు 162 మంది ఉన్నారు.

Students | Representational Image | (Photo Credits: PTI)

Hyderabad, April 3: తెలంగాణలో (Telangana) నేటి నుంచి పదో తరగతి (SSC Exams) వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. మొత్తం 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా వీరిలో రెగ్యులర్ విద్యార్థులు (Regular Students) 4,85,826 మంది. మొత్తం విద్యార్థుల్లో 78 శాతం మంది అంటే 3,78,794 మంది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు కాగా, 98,726 మంది తెలుగు, 7,851 మంది ఉర్దూ, 235 మంది హిందీ, 137 మంది మరాఠీ, 83 మంది కన్నడ మాధ్యమంలో పరీక్షలు రాయనున్నారు. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా అధికారులు 2,652 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో 11 పేపర్లు ఉండగా, ఈసారి ఒక్కో సబ్జెక్టుకు ఒకటి చొప్పున ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయి. విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి  8.30 గంటల నుంచే అనుమతిస్తారు. పరీక్ష కేంద్రానికి  కనీసం అరగంట ముందు చేరుకోవాలని అధికారులు సూచించారు. మొదటి రోజు మాత్రం 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు.

RCB vs MI: విరాట్ విశ్వరూపం, ముంబైను మట్టి కరిపించిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్, ఆడుతూ పాడుతూ టార్గెట్ దంచేశారు..

హాల్ టికెట్లతో ఉచిత ప్రయాణం

‘పది’ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూపించడం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పరీక్ష కేంద్రంలో కాపీయింగ్ కనుక జరిగితే అందుకు ఆయా కేంద్రాల్లోని ఇన్విజిలేటర్లు, ఎంఈవోలు, డీఈవోలు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

IPS Officer VC Sajjanar: అమితాబ్ జీ.. ప్రాడ్ కంపెనీలకు ప్రచారం చేయొద్దు, బాలీవుడ్ బిగ్ బి‌కు రిక్వెస్ట్ చేసిన అమితాబ్ బచ్చన్..

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

'Inter First Year Exams Cancelled': ఏపీలో ఇంటర్‌ మొదటి సంవత్సర పరీక్షలు ఎత్తివేస్తాం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా కీలక వ్యాఖ్యలు

Inter Exams Fee: తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు మూడోసారి పొడిగింపు.. రూ.2,500 అపరాధ రుసుముతో జనవరి 16 వరకు అవకాశం

CM Revanth Reddy: ఇది ఆర్ధిక సాయం కాదు…ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహం, సివిల్స్‌లో మనవాళ్లే రాణించాలన్న సీఎం రేవంత్ రెడ్డి

Telangana Student Dies In US: అమెరికాలో మ‌రో తెలంగాణ విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి.. కారులో శ‌వ‌మై క‌నిపించిన యువకుడు.. బాధితుడు హ‌నుమ‌కొండ జిల్లా వాసి బండి వంశీగా గుర్తింపు

Share Now