Justice Madan B Lokur: విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ లోకూర్, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బయోడేటా ఇదే..
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా జస్టిస్ లోకూర్ సేవలందించారు.
Hyd, July 30: విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్‌గా జస్టిస్ మదన్ భీమ్ రావు లోకూర్ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా జస్టిస్ లోకూర్ సేవలందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నర్సింహారెడ్డితో జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఆ కమిషన్ విచారణను సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు జులై 16న ఉదయం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల తరపున సీనియర్ న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ మనుసింఘ్వీ, సిద్ధార్థ్ లూథ్రా, కేసీఆర్ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. తెలంగాణ విద్యుత్ ఒప్పందాలపై సుప్రీం కోర్టు కీలక కామెంట్స్... విచారణ కమిషన్ ఛైర్మన్‌ను మార్చాలని సూచన
ఇక తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్ నుంచి తప్పుకుంటున్నట్టు సుప్రీంకోర్టుకు జస్టిస్ నరసింహా రెడ్డి లేఖ పంపారు. దీంతో ఆయన స్థానంలో మరొకరి నియామకానికి అత్యున్నత న్యాయస్థానం సమయం ఇచ్చింది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే కొత్త జడ్జి నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగించొచ్చని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ లోకూర్‌ను ప్రభుత్వం నియమించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవకతవకలు, కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్
జస్టిస్ లోకూర్ 1977లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బి. డిగ్రీ పొందారు. ఆయన సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టుల్లో న్యాయవాదిగా పనిచేశారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, రెవెన్యూ, సేవల చట్టాల్లో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 1998 జూలై 14న ఆయన అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. 1999 ఫిబ్రవరి 19న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తి అయ్యారు. అదే ఏడాది జూలై 5న ఢిల్లీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 ఫిబ్రవరి 13 నుంచి మే 21 వరకూ ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. జస్టిస్ లోకూర్ 2012 జూన్ 4న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.