IPL Auction 2025 Live

Charminar Express Derailment: చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో కీలక విషయాలను వెల్లడించిన రైల్వే శాఖ, రైలు డెడ్ ఎండ్‌కు వచ్చిన తర్వాతే సైడ్‌ వాల్‌ను ఢీకొట్టిందని వెల్లడి, చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై మంత్రి పొన్నం విచారం

చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ఐదో నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి చేరుకునే క్రమంలో సైడ్‌ వాల్‌ను ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పి ఒక్కసారిగా కుదుపునకు లోనైంది.మొ​త్తం మూడు బోగీలు పట్టాలు తప్పగా, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు

Charminar Express Derails At Nampally Railway Station (photo-X)

Hyd,Jan 10: నాంపల్లి రైల్వే స్టేషన్‌లో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం జరిగింది. చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ఐదో నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి చేరుకునే క్రమంలో సైడ్‌ వాల్‌ను ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పి ఒక్కసారిగా కుదుపునకు లోనైంది.మొ​త్తం మూడు బోగీలు పట్టాలు తప్పగా, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎస్‌ 2, ఎస్‌ 3, ఎస్‌ 6 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.క్షతగాత్రులను లాలాగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు.

నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో రైలు డెడ్ ఎండ్‌కు వచ్చిన తర్వాతే ప్రమాదం జరిగిందని సీపీఆర్వో రాకేష్‌ తెలిపారు. డ్రైవర్‌ సడన్‌గా బ్రేక్‌ వేయడంతోనే రైలు పట్టాలు తప్పిందన్నారు. డెడ్ ఎండ్ లైన్ ప్రహరికి రైలు తాకింది. దీంతో ట్రాక్ మీద నుంచి రైలు బోగీలు కిందకి జరిగాయని తెలిపారు. చాలా మంది ప్యాసింజర్లు సికింద్రాబాద్‌లోనే దిగిపోయారు. తక్కువ మంది ప్రయాణికులు నాంపల్లికి వచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో S2,S3,S6 బోగీలు పట్టాలు తప్పాయి.

వీడియో ఇదిగో, సైడ్‌ వాల్‌ను ఢీకొట్టి పట్టాలు తప్పిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌, 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు

ఆరు మంది ప్యాసింజర్‌లకు గాయాలయ్యాయి. వారిని లాలాగూడా రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. వీలైనంత త్వరగా ట్రైన్ తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. రైలు తొలగించిన అనంతరం పట్టాలు దెబ్బతిన్న విషయం తెలుస్తోంది. ఈ ప్రమాదం వల్ల నాంపల్లికి వచ్చే కొన్ని రైళ్లను రద్దు చేసే అవకాశం ఉంది’’ అని సీపీఆర్వో రాకేష్‌ వెల్లడించారు.

Here's Video

రైలు.. చెన్నై నుంచి హైదరాబాద్‌కు చేరుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. స్టేషన్‌కు నెమ్మదిగా వస్తుండటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని, కొందరు స్పల్పంగా గాయపడ్డారని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైలు స్టేషన్‌లో ఆగే క్రమంలో నెమ్మదిగా ఉంది కాబట్టి సరిపోయిందని, లేదంటే పెను ప్రమాదం జరిగేదని తెలుస్తోంది.

పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్, ప్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టిన ట్రైన్, 50 మందికి గాయాలు

నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ సైడ్ వాల్‌ని తాకి బోగీలు పట్టాలు తప్పడంపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. పట్టాలు చిన్నగా పక్కకి ఒరగడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు. హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఘటనకు గల కారణాలపై అధికారులతో ఆరా తీశారు.వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. గాయపడిన ప్రయాణికులకు సరైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.