నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ఐదో నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి చేరుకునే క్రమంలో సైడ్‌ వాల్‌ను ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పి ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. ఎస్‌ 2, ఎస్‌ 3, ఎస్‌ 6 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను లాలాగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు. లోకో పైలట్‌ తప్పిదమే దీనికి కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు. స్టేషన్‌కు చేరుకునేందుకు రైలు నెమ్మదిగా కదలడంతో పెను ప్రమాదం తప్పింది.

నాంపల్లి రైల్వేస్టేషన్‌లో జరిగిన ప్రమాదంపై హైదరాబాద్‌ ఇన్‌ఛార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విచారం వ్యక్తం చేశారు. పెను ప్రమాదం తప్పిందని.. అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని సూచించారు.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)