Munugode Bypoll: ట్విస్టులతో సాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక రాజకీయం, లక్షన్నర మందితో నేడు టీఆర్‌ఎస్ ప్రజాదీవెన సభ, కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ కేసీఆర్ వెంట నడవనున్న వామపక్షాలు
అక్కడ టీఆర్‌ఎస్ ప్రజాదీవెన సభకు సర్వం సిద్ధమయింది. సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో ఇప్పటికే సభా ఏర్పాట్లు పూర్తిచేశారు. సభావేదికగా సీఎం కేసీఆర్ కేసీఆర్ మునుగోడు ఉపఎన్నికకు (TRS to kickstart its Munugode campaign) సమరశంఖం పూరించనున్నారు.
Hyd, August 20: మునుగోడు అంతా గులాబీమయం అయింది. అక్కడ టీఆర్‌ఎస్ ప్రజాదీవెన సభకు సర్వం సిద్ధమయింది. సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో ఇప్పటికే సభా ఏర్పాట్లు పూర్తిచేశారు. సభావేదికగా సీఎం కేసీఆర్ కేసీఆర్ మునుగోడు ఉపఎన్నికకు (TRS to kickstart its Munugode campaign) సమరశంఖం పూరించనున్నారు. ప్రజాదీవెన సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నది.
సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో మునుగోడు చేరుకుంటారు. సుమారు నాలుగు వేల కార్లతో కూడా భారీ కాన్వాయ్‌తో ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ నుంచి బయల్దేరనున్నారు. ఇక నెక్లెస్ రోడ్ నుండి భారీ ర్యాలీతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani srinivas yadav), ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam nagender), మేయర్ గద్వాల విజయ లక్ష్మీ(Gadwala vijayalaxmi) మునుగోడుకు బయలుదేశారు.
ప్రజా దీవెన సభకు సీఎం కేసీఆర్ రోడ్డుమార్గంలో వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ వైపు వచ్చే వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సూచించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల వరకు 65వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా సహకరించాలని విజ్ఞప్తిచేశారు. సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా మొత్తం 1300 మంది పోలీసులను మోహరించారు. ఆరుగురు ఎస్పీలు, ఆరుగురు ఏఎస్పీలు, 23 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, 94 మంది ఎస్సైలు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు.
మునుగోడు సమరం (Munugode Bypoll) తెలంగాణలో మరో ఆసక్తికర పరిణామానికి తెర తీసింది. ఉప ఎన్నిక కోసం.. బీజేపీని బలంగా ఢీకొట్టే టీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించాలని వామపక్షాలు సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నాయి. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగబోయే ఈ బహిరంగ సభ నుంచే మద్దతు ప్రకటించాలని, కార్యక్రమానికి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం కేసీఆర్ వాహనంలోనే చాడ.. మనుగోడుకు చేరుకోనున్నట్లు సమాచారం.
ఇక మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకూడదన్న ఆలోచనలో సీపీఐ-సీపీఎంలు ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. కాబట్టి, కాంగ్రెస్ ఓట్లు రెండుగా చీలడం ఖాయమని, ఒకవేళ కాంగ్రెస్‌కు వామపక్షాలు మద్దతిచ్చినా బీజేపీనే లాభపడుతుందని విశ్లేషిస్తున్నాయి. ఈ తరుణంలో.. బీజేపీని ఎదుర్కొనే టీఆర్‌ఎస్‌కు ఇవ్వడం కొంత మంచిదని నిర్ణయించుకున్నాయి. రెండు పార్టీలకు కలిపి మునుగోడు నియోజకవర్గంలో 25 వేలకుపైగానే ఓటింగ్ ఉండగా.. విజయవకాశాలను ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
మునుగోడు ఉపఎన్నికలను అన్ని పార్టీలు సీరియస్‌గా తీసుకున్నారు. అధికార పార్టీ (TRS), బీజేపీ (BJP) పార్టీలు మునుగోడులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్ (Congress) మునుగోడులో పాదయాత్రలు చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా వినూత్నరీతిలో ప్రచారానికి టీపీసీసీ (TPCC) ప్రణాళికను సిద్ధం చేసింది. ఇంటింటికీ వెళ్లి లక్ష మంది కాళ్లు మొక్కి ఓటు అడిగే లా వ్యూహాన్ని రంచించింది. అందుకోసం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) వీరాభి మానులు రంగంలోకి దిగనున్నారు. వెయ్యి మంది అభిమానులతో స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఓ వైపు పార్టీ నేతల ప్రచారం, మరో వైపు రేవంత్ (TPCC chief) టీమ్ ఓటర్ల కాళ్లు మొక్కి ఓటు అడిగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ ధన ప్రవాహాన్నీ సెంటిమెంట్‌తో తిప్పి కొట్టాలని పీసీసీ (PCC) స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.