VRA Slits Throat: సమస్యలను పట్టించుకోవడం లేదని మనస్తాపం.. గొంతు కోసుకున్న వీఆర్ఏ.. నెక్కొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరం వద్ద ఘటన.. వేతన సవరణ, పదోన్నతులు సహా పలు డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలు 69 రోజులుగా దీక్ష

తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో ఓ వీఆర్ఏ బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. వరంగల్ జిల్లా గుండ్రపల్లిలో జరిగిందీ ఘటన. వేతన సవరణ, పదోన్నతులు సహా పలు డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలు 69 రోజులుగా దీక్ష చేస్తున్నారు.

VRA (Photo Credits: Twitter)

Nekkonda, October 2: తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో ఓ వీఆర్ఏ (VRA) బ్లేడుతో (Blade) గొంతు కోసుకున్నాడు. వరంగల్ జిల్లా (Warangal) గుండ్రపల్లిలో జరిగిందీ ఘటన. వేతన సవరణ, పదోన్నతులు సహా పలు డిమాండ్ల (Demands) సాధన కోసం వీఆర్ఏలు 69 రోజులుగా దీక్ష చేస్తున్నారు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మనస్తాపం చెందిన వీఆర్ఏ ఖాసిం.. నెక్కొండ (Nekkonda) తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన దీక్షా శిబిరం వద్ద బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించారో జాగ్రత్త.. కాలేజీ గుర్తింపు రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోము : జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్‌బోర్డు హెచ్చరిక

వెంటనే అప్రమత్తమైన సహచర వీఆర్ఏలు అతడిని అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోరుతూ నెలల తరబడి దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Telangana Shocker:ఎండాకాలం క‌దా అని ఐస్ క్రీం తింటున్నారా? ఈ వీడియో చూస్తే వాటి జోలికే వెళ్ల‌రు, ఐస్ క్రీమ్ లో వీర్యం, మూత్రం క‌లుపుతున్న వ్య‌క్తి, సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్, అరెస్టు చేసిన పోలీసులు

VRA Slits Throat: సమస్యలను పట్టించుకోవడం లేదని మనస్తాపం.. గొంతు కోసుకున్న వీఆర్ఏ.. నెక్కొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరం వద్ద ఘటన.. వేతన సవరణ, పదోన్నతులు సహా పలు డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలు 69 రోజులుగా దీక్ష

Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Advertisement

World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన

Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్‌ డోర్‌.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)

Advertisement
Advertisement
Share Now
Advertisement