Warangal, March 20: ఐస్‌క్రీమ్‌ను తలుచుకుంటేనే వాంతి చేసుకునేంత పనిచేశాడో ప్రబుద్ధుడు. ఏం పైత్యమోగానీ.. ప్రజలకు అమ్మే ఐస్‌క్రీమ్‌లో తన వీర్యాన్ని (mixing semen), మూత్రాన్ని కలిపాడు. ఈ దారుణాన్ని చాటుగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన ఓ వ్యక్తి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. సదరు ప్రబుద్ధున్ని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా నెక్కొండలో రాజస్థాన్‌కు చెందిన కాలురాం పుర్బియా అనే వ్యక్తి ఐస్‌క్రీమ్ బండి (Ice Cream) పెట్టుకున్నాడు. అంబేద్కర్ కూడలిలో రోజూ ఐస్‌క్రీమ్‌లు విక్రయిస్తుంటాడు. బహిరంగంగానే తన వీర్యాన్ని, మూత్రాన్ని ఐస్‌క్రీమ్‌లో కలుపుతుండగా ఓ వ్యక్తి వీడియో (Viral video) తీశాడు.
దారుణం..ఐస్ క్రీంలో వీర్యం కలుపుతున్నాడు
వరంగల్ - నెక్కొండలో రోడ్డుపై ఐస్ క్రీమ్ అమ్ముతున్న వ్యక్తి దానిలో వీర్యం కలుపుతున్నాడు. pic.twitter.com/BYJkYZ496H
— Telugu Scribe (@TeluguScribe) March 19, 2024
ఇది సోమవారం రాత్రి వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్సై మహేందర్ విచారణ చేపట్టి బహిరంగ ప్రదేశంలో హేయమైన చర్యకు పాల్పడ్డ కాలురాం పుర్బియాను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వరంగల్ జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ చేపూరి కృష్ణమూర్తి ఐస్‌క్రీమ్ బండికి సంబంధించిన శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు తరలించారు. పంచాయతీ కార్యదర్శి సదానందంతో కలిసి ఐస్‌క్రీమ్ బండిలోని ఐటమ్స్‌ను బయట పారబోయించారు.
నెక్కొండ మండలంలో నిన్న ఒక వాట్సాప్ వీడియోలో బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించిన అతనిపైన
నెక్కొండ పోలీస్ వారు చట్టపరంగా కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగినది. @cpwarangal @acpnarsampet @dcpeastwrlc pic.twitter.com/r50j1pQEDg
— SHO NEKKONDA (@Sho_Nekkonda) March 19, 2024
ఈ సందర్భంగా సీఐ చంద్రమోహన్ మాట్లాడుతూ.. బండ్లపై ఐస్‌క్రీమ్‌లు, తినుబండారాలు విక్రయించేవారు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బయట పదార్థాలకు దూరం గా ఉంటేనే మంచిదని తెలిపారు. నెక్కొండలో ఐస్‌క్రీమ్‌లు అమ్మేవారిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి హెచ్చరికలు జారీచేశారు.