PM Modi in Telangana: రోజుకు మూడు కిలోల తిట్లు తింటాను అందుకే అలిసిపోను: మోడీ, సాయంత్రం ఛాయ్ తాగుతూ తిట్లను ఎంజాయ్ చేయాలంటూ బీజేపీ కార్యకర్తలకు పిలుపు, హైదరాబాద్‌ విమానాశ్రయంలో మోదీ సభ

22 ఏళ్లుగా నన్ను చాలామంది తిడుతునే ఉన్నారు..నన్ను తిట్టేవారిని పట్టించుకోకండీ..సాయంత్రం చాయ్ తాగుతు ఆ తిట్లను ఎంజాయ్ చేయండీ అంటూ కార్యకర్తలకు ప్రధాని మోడీ దిశానిర్ధేశం చేశారు.

PM Modi (Photo-Video Grab)

Hyderabad, NOV 12: ఏపీ పర్యటన ముగించుకుని తెలంగాణకు (Telanagana) వచ్చారు ప్రధాని మోడీ (PM Modi) ఈ సందర్బంగా బేగంపేటలో బీజేపీ ఏర్పాటుచేసిన సభలో టీఆర్ఎస్ (TRS) పభుత్వంపై తనదైనశైలిలో శాంతంగా..వాడిగా వేడిగా విమర్శలు సంధించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నన్ను..బీజేపీని తిట్టటమే పనిగా పెట్టుకుందని..నన్ను,బీజేపీని తిట్టటం వల్ల తెలంగాణకు ప్రయోజనం కలుగుతుంది అనికుంటే ఎన్నైనా తిట్టుకోండి కానీ తెలంగాణ ప్రజలను తిడితే మాత్రం సహించను..బదులు చెప్పి తీరుతాను అన్నారు మోడీ.

తాను కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు ఇలా చాలా రాష్ట్రాలు తిరుగుతుంటాను..మీరు ఇలా విశ్రాంతి లేకుండా తిరుగుతాను కదా అలసిపోరా అని కొంతమంది తనను అడుగుతుంటారని కానీ నేను అలసి పోను..ఎందుకంటే తనను చాలామంది తిట్టుకుంటుంటారని అలా నేను రోజుక రెండు మూడు కిలోల తిట్లు తింటుంటాను అందుకే అలసిపోను అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చురకలు వేశారు ప్రధాని మోడీ. 22 ఏళ్లుగా నన్ను చాలామంది తిడుతునే ఉన్నారు..నన్ను తిట్టేవారిని పట్టించుకోకండీ..సాయంత్రం చాయ్ తాగుతు ఆ తిట్లను ఎంజాయ్ చేయండీ అంటూ కార్యకర్తలకు ప్రధాని మోడీ దిశానిర్ధేశం చేశారు.

CM Jagan Speech in Visakha: మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, మరో అజెండా లేదు,ఉండదు..ఉండబోదు విశాఖలో సీఎం జగన్, ఏపీని అన్ని విధాల ఆదుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి 

ప్రజలకు సేవ చేయడానికి ఉన్న మార్గం రాజకీయం అని అటువంటి రాజకీయాల్లోకి నేను ప్రజలకు సేవల చేయటానికే వచ్చానన్నారు. రాజకీయాలు సేవాభావంతో ఉండాలి..కానీ తెలగాణలో మాత్రం అధికారంలో ఉన్నవారు మోడీని తిట్టటమే రాజకీయం అనుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు ఎన్నివిధాలుగా బీజేపీని తిట్టినా మేం మాత్రం పాజిటివ్ దృక్పథంతోనే ఉంటామని మా కార్యకర్తలు అంకితభావంతోనే పనిచేస్తారని అన్నారు ప్రధాని మోడి. నేను తెలంగాణను..హైదరాబాద్ ను ఎప్పటికీ మర్చిపోలేను..2013లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా మీద తెలంగాణ ప్రజలు చూపించిన ప్రేమను ఎన్నిటి మర్చిపోలేనన్నారు.