Visakhapatnam, Nov 12: విశాఖలో ప్రధాని మోదీ సభ ముగిసింది. విశాఖ సభకు.. అశేషంగా తరలివచ్చిన జనవాహిని ఉద్దేశించి.. ఏపీ సీఎం జగన్ పలువురు ప్రముఖులను స్మరించుకున్నారు. ఉత్తరాంధ్ర గడ్డపై నడయాడిన మహాకవుల మాటలను గుర్తు చేశారు. వారి సాహిత్యాన్ని పలికి వినిపించారు.
ప్రజాకవి వంగపండు, మహాకవులు శ్రీశ్రీ, గురజాడ వంటి వారిని స్మరించారు. 8 ఏళ్ల క్రితం విభజన వల్ల రాష్ట్రానికి ఏర్పడ్డ గాయం.. ఇంకా మానలేదని సీఎం జగన్ (CM Jagan Speech in Visakha) అన్నారు. కేంద్రం నుంచి సాయం అందితే.. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామన్నారు. చేసిన సాయాన్ని మర్చిపోయే వాళ్లం కాదని.. సాయం చేసిన వారిని గుండెల్లో పెట్టుకునే సంస్కృతి తమదన్నారు.
దేశ ప్రగతి రథసారథి నరేంద్ర మోదీ అని, సహృదయంతో ఏపీని అన్ని విధాల ఆదుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. శనివారం విశాఖపట్నం ఏయూ ప్రాంగణంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీతో వేదిక పంచుకున్నారాయన. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..విశాఖలో జనసముద్రం కనిపిస్తోంది. దేశ ప్రగతి సారథి ప్రధాని నరేంద్ర మోదీగారికి స్వాగతం. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాల్లా జనం ఇక్కడికి తరలి వచ్చారు. వంగపాడు పాట ‘ఏం పిల్లడో ఎల్దామొస్తవా..’ అనే పాటలా జనం తరలివచ్చారు. జగన్నాథ రథచక్రాలు ఇక్కడికి కదిలి వచ్చాయి. దాదాపు పది వేల కోట్ల రూపాయలకు పైగా ప్రాజెక్టులు ప్రారంభిస్తున్న ప్రధాని మోదీకి.. రాష్ట్ర ప్రభుత్వం, అశేష జనం తరపున ధన్యవాదాలు.
ఈ మూడున్నరేళ్లలో ఏపీ సంక్షేమం, అభివృద్ది దిశగా దూసుకెళ్లింది. విద్య, వైద్యం, సాగు, సామాజిక న్యాయం, మహిళా సంక్షేమం, అభివృద్ధి, సంక్షేమం, గడప వద్దకే పరిపాలన మా ప్రాధాన్యతలు అయ్యాయి. ప్రతి కుటుంబం నిలదొక్కుకునేందుకు మా అర్థిక వ్యవస్థలో ప్రతీ రూపాయి ఖర్చు చేశాం. వీకేంద్రీకరణ, పాదర్శకతతో పాలన కొనసాగిస్తున్నాం.కేంద్ర ప్రభుత్వంతో ...ప్రత్యేకంగా మీతో ... మా అనుబంధం ... పార్టీలకు రాజకీయాలకు అతీతం . మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప (We have no other agenda) మాకు మరో అజెండా లేదు ... ఉండదు...ఉండబోదని సీఎం వైయస్.జగన్ తెలిపారు.
నిలదొక్కుకునేందుకు ఏపీ ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతం. మాకు మరో ఎజెండా లేదు.. ఉండబోదు. రాష్ట్రాభివృద్ధికి మీ సహాయ సహకారాలు మరింత కావాలి. ఎనిమిదేళ్ల కిందటినాటి విభజన గాయం నుంచి ఏపీ ఇంకా కోలుకోలేదు. విభజన హామీలైన పోలవం, రైల్వేజోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి.. ప్రత్యేక హోదా వరకు అన్ని హామీలు పూర్తి చేయాలని కోరుతున్నాం. పెద్దలు సహృదయులైన మీరు(ప్రధానిని ఉద్దేశిస్తూ..) మమ్మల్ని ఆశీర్వదించాలి. ఏపీని తగిన విధంగా కేంద్రం ఆదుకోవాలి. మీకు చేసిన విజ్ఞప్తులను పరిష్కరించాలని మరోసారి కోరుతున్నాం అని సీఎం జగన్.. ప్రధాని సమక్షంలోనే విజ్ఞప్తి చేశారు.
విశాఖ సభలో ప్రధాని మోడీ ఎదుట..విభజన హామీలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ వంటి అంశాలను లేవనెత్తారు. గతంతో పాటు.. తాజాగా చేసిన తమ విన్నపాలను పెద్ద మనస్సుతో పరిగణలోకి తీసుకుంటారని.. రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తారని.. మనసారా కోరుకుంటున్నట్లు.. విశాఖ సభా వేదికపై మోడీకి విజ్ఞప్తి చేశారు.ప్రతీ ఒక్క కుటుంబం నిలదొక్కుకుంటేనే.. రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని.. ఏపీ సీఎం జగన్ అన్నారు. విద్యా, వైద్యం, రైతుల సంక్షేమం, సామాజిక న్యాయం వంటి అంశాలతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ, గడప వద్దకు పాలనను ప్రాధాన్యాంశాలుగా అడుగులు ముందుకేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. శక్తిమేర అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కేంద్రం నుంచి మరింత సాయం అందించాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీకి జగన్ విజ్ఞప్తి చేశారు.