Representational (Credits: Google)

Hyderabad, Nov 12: ప్రధాని మోదీ (PM Modi) పర్యటన సందర్భంగా ఈరోజు (Today) హైదరాబాద్ (Hyderabad) లో పోలీసులు (Police) ట్రాఫిక్ (Traffic) ఆంక్షలు విధించారు. శనివారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాష్ నగర్, రసూల్ పురా, ప్యాట్నీ సిగ్నల్ వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. రసూల్ పూర్, సోమాజిగూడ, రాజ్ భవన్ రోడ్, ఖైరతాబాద్ సిగ్నిల్ వరకు ట్రాఫిక్ ఉండే అవకాశాలున్నాయన్నారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ మార్గాల్లో కాకుండా వేరే మార్గాల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

హిమాచల్ ప్రదేశ్‌లో ప్రారంభమైన పోలింగ్.. రాష్ట్రంలోని 68 స్థానాల్లో పోటీపడుతున్న 412 మంది అభ్యర్థులు.. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్న 55 లక్షల మంది ఓటర్లు.. అధికారం కోసం ఆశగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్, ఆప్.. సంప్రదాయానికి ఓటర్లు ఫుల్‌స్టాప్ పెడతారంటున్న బీజేపీ

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసేందుకు నేడు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ (PM Modi to visit Hyderabad on November 12)లో పర్యటించనున్నారు.

ప్రధాని పర్యటన షెడ్యూలు ఇదీ..

  • మధ్యాహ్నం 1.30కి బేగంపేట విమానాశ్రయానికి రాక
  • 1.40 నుంచి 2 గంటల వరకు బహిరంగసభకు హాజరు
  • 2.15 గంటలకు బేగంపేట-రామగుండం బయలుదేరుతారు
  • 3.20కి రామగుండం చేరుకుంటారు
  • 3.30-4 గంటల వరకు రామగుండం ప్లాంటు సందర్శన
  • 4.15 గంటలకు బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు
  • సభ అనంతరం 5.30కు రామగుండం నుంచి బయలుదేరి
  • 6.30 కు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు
  • 6.40కి బేగంపేట నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు