CM Jairam Thakur and His Family after casting vote (Credits: ANI)

Shimla, Nov 12: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) శాసనసభ ఎన్నికల పోలింగ్ (Assembly Elections Polling) ప్రారంభమైంది. గత నాలుగు దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకి రెండోసారి అధికారం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈసారి ఓటర్లు (Voters) ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టి తమకు రెండోసారి అధికారం కట్టబెడతారని బీజేపీ (BJP) ఆశలు పెట్టుకోగా, ఈసారి అధికారం తమదేనని కాంగ్రెస్ (Congress) ఘంటాపథంగా చెబుతోంది. మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్-AAP) కూడా ఆశలు పెట్టుకుంది.

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..  ప్రధాని నరేంద్ర మోదీతో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ భేటీ.. ఎనిమిదేళ్ల తర్వాత ప్రధానిని కలవడం ఇదే ప్రథమం అన్న పవన్.. ప్రధాని మోదీ అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారని వెల్లడి.. ప్రెస్ మీట్ పూర్తి వీడియో ఇదిగో..

రాష్ట్రంలోని మొత్తం 55 లక్షల మంది ఓటర్లు 68 స్థానాల్లో పోటీపడుతున్న 412 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పోటీపడుతున్న అభ్యర్థుల్లో ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్, మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ తదితరులు కూడా ఉన్నారు. అభివృద్ధి అజెండాతో రెండోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ బలంగా నమ్ముతోంది. సీఎం జై రామ్ ఠాకూర్, అయన కుటుంబ సభ్యులు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. రాష్ట్రంలో ప్రచారాన్ని ప్రధాని నరేంద్రమోదీ ముందుండి నడిపించారు. కమలానికి వేసే ప్రతి ఓటు తన బలాన్ని మరింత పెంచుతుందని ప్రచారంలో మోదీ పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా పడిపోతున్న గ్రాఫ్‌ను నిలబెట్టుకోవాలని, పార్టీలో పునరుజ్జీవం తీసుకురావాలి యోచిస్తోంది.