Visakhapatnam, Nov 12: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాజకీయాల్లో (Politics) ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. విశాఖ పర్యటనకు (Visakhapatnam) వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో జనసేన పార్టీ (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భేటీ అయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత వీరిరువురు సమావేశమయ్యారు. వాస్తవానికి ప్రధానిని మొదట బీజేపీ కోర్ కమిటీ సభ్యులు కలవాల్సి ఉంది. ఆ తర్వాతే పవన్ కల్యాణ్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారు. అయితే ప్రధాని పర్యటన గంటన్నర ఆలస్యం కావడంతో, మోదీని మొదట పవన్ కల్యాణ్ కలిశారు. ఈ కీలక సమావేశానికి పవన్ తో పాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. ఈ భేటీ ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఎనిమిదేళ్ల తర్వాత ప్రధానిని కలవడం ఇదే ప్రథమం అని వెల్లడించారు.
ప్రధాని మోదీ అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలని, తెలుగు ప్రజలు ఐక్యంగా ఉండాలని అభిలషించారని పవన్ వివరించారు. ఏపీకి భవిష్యత్తులో మంచి రోజులు తెచ్చే దిశగా ఈ భేటీ ఫలప్రదం అయిందని భావిస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.