Telangana Weather Update: రెండు రోజులు బయటకు రావొద్దు, ఆదివారం తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని తెలిపిన ఐఎండీ, తెలంగాణలో కొన్ని జిల్లాలో 3 రోజులు వర్షాలు కురుస్తాయని అంచనా..
పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటుతున్నాయి. అడుగు తీసి బయట పెట్టాలంటే జనం జంకుతున్నారు. శుక్రవారం నల్గొండ జిల్లాలోని ఇబ్రహీంపేటలో 43.5, కనగల్‌లో 43.4, మాడుగులపల్లిలో 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Hyd, April 5: తెలుగు రాష్ట్రాలపై భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటుతున్నాయి. అడుగు తీసి బయట పెట్టాలంటే జనం జంకుతున్నారు. శుక్రవారం నల్గొండ జిల్లాలోని ఇబ్రహీంపేటలో 43.5, కనగల్‌లో 43.4, మాడుగులపల్లిలో 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఏప్రిల్ మొదటి వారంలోనే 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ముందుముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో వచ్చే రెండురోజులు(శని, ఆది) వడగాలులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో ఎండల తీవ్రత సైతం రెండు, మూడు డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో ఎండలు 43 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయని.. ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటలకు ప్రజలు బయటకు రావొద్దని పేర్కొంది.అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే జాగ్రత్తలు తీసుకోవాలని.. ఆదివారం తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ ప్రజలకు కూల్ న్యూస్! రెండు రోజుల పాటూ వర్షాలు కురిసే అవకాశముందన్న ఐఎండీ, ఏయే జిల్లాల్లో వర్షాలున్నాయంటే?
శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఆదివారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ వడగాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
ఇదిలా ఉంటే ఎండల వేడితో అల్లాడుతున్న వారికి హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad) తీపి కబురు తెలియజేసింది. తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని చల్లని సమాచారం ఇచ్చింది. ఆదివారం (ఏప్రిల్ 7వ తేదీ) నుంచి మంగళవారం వరకు వర్ష ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీ అలర్ట్! రాబోయే ఐదు రోజుల పాటూ అత్యవసరమైతేనే బయటకు రండి, ఏపీలోని పలు జిల్లాలో వడగాల్పులు వీస్తాయని ఐఎండీ హెచ్చరిక
ఏప్రిల్ 8 సోమవారం రోజున ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో వర్ష ప్రభావం ఉండనుంది. ఆ మరుసటి రోజు కామారెడ్డిలో వర్షం కువనుందని పేర్కొంది. వర్షమే కాదు ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.కాగా రాజధాని నగరం హైదరాబాద్‌లో వర్ష ప్రభావం లేదని తెలిపింది. మిగతా చోట్ల వర్షం పడటంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.