Telangana Weather Alert: కరోనావైరస్‌కి వర్షాలు తోడు, తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు, హెచ్చరించిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం, పరిస్థితులు పూర్తిగా మారిపోయే ప్రమాదం

కాని తాజాగా హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. రానున్నమూడు రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం (Rain Alert in Telangana) ఉందని తెలిపింది. తేలికపాటి జల్లుల నంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్నాయని వెల్లడించింది. కోమెరిన్ ప్రాంతం నుంచి రాయలసీమ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ప్రభావం ఏర్పడింది.

heavy-rainfall-warning-to-telangana(Photo-ANI)

Hyderabad, April 4: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో (Telangana) వేడి ఉష్ణోగ్రతలు ఉండడంతో కరోనా విస్తరణ తగ్గు ముఖం పడుతుందని అందరూ భావిస్తున్నారు. కాని తాజాగా హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. రానున్నమూడు రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం (Rain Alert in Telangana) ఉందని తెలిపింది.

తెలంగాణలో భారీగా పెరిగిన కోవిడ్-19 కేసులు

తేలికపాటి జల్లుల నంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్నాయని వెల్లడించింది. కోమెరిన్ ప్రాంతం నుంచి రాయలసీమ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ప్రభావం ఏర్పడింది.

మరోవైపు సౌత్ మధ్య మహారాష్ట్ర, దాని రీజనల్ ఏరియాస్ లో 1.5 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతాకవరణ శాఖ అధికారులు వెల్లడించారు. వీటి ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు రాజధాని నగరం హైదరాబాద్ లోనూ ఆకాశం మేఘావృతమై ఉంది. వాతావరణశాఖ వర్షాల అంచనాతో పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మందుబాబుల చేతి వాటం, వైన్ షాపు పగులకొట్టి మద్యం లూటీకి పాల్పడిన దుండుగులు

ఇదిలా ఉంటే కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి ప్రజలను తెలుగు రాష్ట్రాల ప్రజలను గడగడలాడిస్తుంది. చల్లటి వాతావరణంలోనే ఈ మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వేసవికాలం కావడం.. తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుందుని ప్రజలందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం షాకింగ్ వార్త చెప్పింది.