Hyderabad, April 04: దేశ వ్యాప్త లాక్‌డౌన్ నేపథ్యంలో (Lockdown) అత్యవసర సర్వీసులు తప్ప అన్నింటినీ మూసివేసారు. ముఖ్యంగా వైన్ షాపులు మూసివేయడంతో వైన్ దొరక్క మందుబాబులు నానా కష్టాలు పడుతున్నారు. తెలంగాణలో (Telangana) మద్యం దుకాణాలు మూసివేయడంతో మందుబాబులు అల్లాడుతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా.. మద్యం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణలో భారీగా పెరిగిన కోవిడ్-19 కేసులు, ఒక్కరోజులోనే 75 కేసులు నమోదు
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ (Hyderabad) నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు మద్యం షాప్ లూటీకి పాల్పడ్డారు. షాప్ మూసివేడంతో వెనుక నుంచి రంద్రం చేసి లోపలికి ప్రవేశించారు. వేల రూపాయల విలువైన మద్యం బాటల్స్‌తో (Miscreant loots wine shop) పరారయ్యారు. ఇది సీసీటీవీలో (CCTV) రికార్డయింది. ఈ దుకాణం ప్రభుత్వ గాంధీ ఆసుపత్రికి (Gandhi Hospital) ఎదురుగా ఉంది. లాక్డౌన్ కారణంగా మూసివేయబడింది.
కాగా లాక్డౌన్ కారణంగా దుకాణం లాక్ చేయబడినందున దుకాణ యజమానులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా దుకాణంలో మరియు చుట్టుపక్కల ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాలను తనిఖీ చేశారు. రెండు కెమెరాల నుండి ఫీడ్ రావడం లేదని యజమానులు గమనించారు. వారు వెంటనే ఎక్సైజ్ మరియు పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. పోలీసులు సీసీటీవీ వీడియోల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. మద్యం సీసాలతో పాటు, చొరబాటుదారుడు రూ .8 వేల నగదు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
కాగా మద్యం దొరక్క దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలోనూ తొమ్మదిమంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే కేరళ సర్కారు డాక్టర్ ప్రిస్కిప్షన్ తో మందుబాబులకు వైన్ అందించేందుకు రెడీ అయింది.