Telangana Youth Congress Elections: నేతలందరి టార్గెట్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌పైనే, ఆసక్తిక రంగా యూత్ కాంగ్రెస్‌ ఎన్నికలు, బహిరంగంగానే బల్మూరికి ఓటేయొద్దని చెబుతున్న ఎమ్మెల్యేలు, గెలిచేది ఎవరో!

ఈ నేపథ్యంలో పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ నేతలంతా నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ముఖ్యంగా కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్ష పదవులకు గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ విద్యార్థి, యువజన సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం అనవాయితీ.

Telangana Youth Congress elections, all are against MLC Balmuri Venkat,who will won elections battle!(X)

Hyd, Aug 11: తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ నేతలంతా నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ముఖ్యంగా కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్ష పదవులకు గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ విద్యార్థి, యువజన సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం అనవాయితీ.

ప్రస్తుతం కాంగ్రెస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా ఉన్నారు బల్మూరి వెంకట్. ఈసారి యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు వెంకట్. దీంతో ఇది మిగితా నేతలకు కంటగింపుగా మారింది. ఒక నేతకు ఒక పదవి ఉంటే సరిపోదా రెండు పదవులు ఎందుకు అని మండిపడుతున్నారు.

బల్మూరిపై కొంతమంది నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక వెంకట్‌కు పోటీగా పొన్నం త‌రుణ్ గౌడ్‌, సిద్ధిపేట డీసీసీ అధ్యక్షుడు తూముకుంట న‌ర్సారెడ్డి కూతురు ఆంక్షా రెడ్డి, జ‌క్కిడి ప్రభాక‌ర్ రెడ్డి కుమారుడు జ‌క్కిడి శివ‌చ‌ర‌ణ్ రెడ్డి తీవ్రంగా పోటీపడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ తర్వాత కీలకంగా ఉంది యువజన కాంగ్రెస్ విభాగమే. అగ్రనేత రాహుల్‌ సైతం స్వయంగా వీరితో తరచూ మాట్లాడుతుంటారు కాబట్టి గట్టి పోటీ నెలకొంది. దీనికి తోడు పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో పోటీ మరింత పెరిగింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఏకంగా 18 మంది దర‌ఖాస్తు చేసుకోగా వీరిలో 8 మందిని తిరస్కరించారు. ఇక పోటీలో 10 మంది అభ్యర్థులు ఉండగా నేతలంతా బల్మూరిని టార్గెట్ చేశారు. స్టాన్ ఫర్డ్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ శాటిలైట్ సెంటర్ ఏర్పాటును చేయాలని కోరిన రేవంత్

Here's Video:

 రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అయితే ఏకంగా వెంకట్‌ను ఒక్కరూ ఓటేయోద్దని ...ఒక్కరికే రెండు పదవులు ఉంటే ఎట్లా.. ఎమ్మెల్సీ పదవి ఉండగా యూత్ ప్రెసిడెంట్ పోస్ట్ ఎందుకని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా అలుపెరగని పోరాటాలు చేశారు వెంకట్. ఆయనపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో అంతా వెంకట్‌నే టార్గెట్‌ చేయడం మాత్రం యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మొత్తంగా విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.