'ICMR Guidelines Revised' : కోవిడ్-19 పేషెంట్లకు చికిత్స తర్వాత ఎలాంటి టెస్టులు లేకుండానే డిశ్చార్జ్, ICMR గైడ్‌లైన్స్ ప్రకారమే నడుచుకుంటున్నామన్న తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంధర్

తాజాగా పలు కీలక మార్పులతో ICMR గైడ్‌లైన్స్ విడుదల చేసిందని వాటి ప్రకారం డిశ్చార్జ్ పాలసీ, హోమ్ ఐసోలేషన్, డెత్ గైడ్‌లైన్స్‌ను...

Telangana Health Minister Eatala Rajender . | File Photo

Hyderabad, May 17: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో అదుపులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్‌లో ఆక్టివ్ కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పని చేస్తున్న నోడల్ అధికారులు, డాక్టర్లతో మంత్రి స్వయంగా మాట్లాడారు. ఒక కుటుంబంలో ఎక్కువ మందికి వైరస్ సోకడం వల్లనే రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి అని మంత్రి తెలిపారు. ICMR మార్గనిర్ధేశకాల ప్రకారమే వీరందరికీ చికిత్స అందిస్తున్నామని మంత్రి తెలియజేశారు.

తాజాగా పలు కీలక మార్పులతో ICMR గైడ్‌లైన్స్ విడుదల చేసిందని వాటి ప్రకారం డిశ్చార్జ్ పాలసీ, హోమ్ ఐసోలేషన్, డెత్ గైడ్‌లైన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుందని ప్రకటించారు.  " ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ నూతన మార్గనిర్దేశకాల ప్రకారం కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులను పది రోజుల పాటు చికిత్స అందించిన తరువాత ఎటువంటి పరీక్షలు చేయకుండానే డిశ్చార్జ్ చేయవచ్చని పేర్కొంది".  ఇలా డిశ్చార్జ్ అయిన వారిని మరో ఏడు రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉంచాలని తెలిపింది. అయితే లక్షణాలు ఎక్కువ ఉండి, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేషంట్లను మాత్రం హాస్పిటల్ లో ఉంచి చికిత్స అందిచాలని ICMR నిర్దేశించిందని మంత్రి ఈటల తెలిపారు.

హోమ్ ఐసోలేషన్ కొరకు మే 10వ తేదీన విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం ప్రైమరీ, సెకండరీ, టెర్శరీ కాంటాక్ట్స్ ను లక్షణాలు లేకుంటే ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలని ICMR మార్గ నిర్ధేశాలు విడుదల చేసింది. ఇంట్లో ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి అందులో ఉంచాలని, వారికి సహాయం కోసం ఒక వ్యక్తి అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, అలా సహాయం అందించే వ్యక్తికి HCQ టాబ్లెట్స్ అందించాలని సూచించింది. 17 రోజుల పాటు వారిని పర్యవేక్షణలో ఉంచాలని ICMR తెలిపిందని మంత్రి పేర్కొన్నారు.

ఇలా హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారిని ఉదయం మరియు సాయంత్రం రెండు వేళలా మెడికల్ టీంలు పరీక్షలు చేస్తారని, వారికి అవసరం అయ్యే నిత్యావసర వస్తువులు అన్నీ అందజేస్తామని ఈటల వెల్లడించారు. సమన్వయం కోసం ప్రత్యేక నోడల్ ఆఫీసర్ ని కూడా నియమించినట్లు చెప్పారు.  హైదరాబాద్‌లో ఒకే అపార్ట్‌మెంట్‌లోని 25 మందికి కరోనావైరస్ పాజిటివ్

కోవిడ్ మరణాల విషయంలో కూడా ICMR నూతన మార్గనిర్దేశకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం కేన్సర్, గుండె జబ్బులు, లేదా ఇతర జబ్బులతో చనిపోయిన వారికి కరోనా పాజిటివ్ అని నిర్ధారించబడినప్పటికీ కూడా దీర్ఘకాలిక వ్యాధులతోనే చనిపోయినట్టుగానే పరిగణించాలని కొత్త నిభందనలు చెప్తున్నాయి. ఈ మరణాల కారణాలను విశ్లేషించడానికి ప్రొఫెసర్లతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం చేస్తుంది. వారిచ్చిన డెత్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారమే మరణాలను ప్రకటించాలని ICMR తెలిపింది.  "కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు దాచేస్తే దాగేవి కావు". అని  కొందరి విమర్శలు, కొన్ని మీడియా కథనాలకు స్పందనగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ బదులిచ్చారు.



సంబంధిత వార్తలు

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం

Kamareddy: వివాహేతర సంబంధం...ముగ్గురి ప్రాణాలు తీసింది, ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ మరోకరి ఆత్మహత్య..కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురి ఆత్మహత్యలు

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం