Telangana: తెలంగాణలో మళ్లీ వేడెక్కిన పొలిటికల్ వార్, నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి, ప్రతిగా తెలంగాణ భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలు
నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు హంగామా చేశారు.ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ (defamatory remarks against MLC Kavitha) హైదరాబాద్‌లోని అరవింద్ ఇంటిని టీఆర్‌ఎస్ కార్యకర్తలు (TRS activists storm) ముట్టడించారు.
Hyd, Nov 18: తెలంగాణ పొలిటికల్ వార్ మరోసారి వేడెక్కింది. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు హంగామా చేశారు.ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ (defamatory remarks against MLC Kavitha) హైదరాబాద్‌లోని అరవింద్ ఇంటిని టీఆర్‌ఎస్ కార్యకర్తలు (TRS activists storm) ముట్టడించారు.ఈ క్రమంలోనే అరవింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
అనంతరం, వారందరూ అరవింద్ ఇంట్లోకి (Nizamabad MP Aravind’s house) దూసుకెళ్లి అద్దాలు, ఫర్నీచర్, ఇంటి ఆవరణలో ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు. దీంతో, పోలీసులు టీఆర్‌ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఎంపీ అరవింద్ ఇంట్లో లేని సమయంలో టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడి చేశారు. నిజామాబాద్ జిల్లా దిశా మీటింగ్ ఉన్న సమయంలో హైదరాబాద్‌లోని ఎంపీ అర్వింద్ ధర్మపురి నివాసంపై టీఆర్‌ఎస్ నేతలు దాడి చేశారు.
ఈ ఘటనతో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడిని నిరసిస్తూ బీజేపీ నాయకులు తెలంగాణ భవన్ ముట్టడి చేసేందుకు బయలుదేరారు. అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకొని పలువురిని అరెస్ట్ చేశారు. ఇక తెలంగాణ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు, కార్యకర్తలు సిద్ధమైన క్రమంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం ముందు భారీగా పోలీసులు మోహరించారు. అలాగే నిజామాబాద్, ఆర్మూర్‌లో ఎంపీ అర్వింద్ నివాసాల వద్ద భద్రత ఏర్పాటు చేశారు.ప్రజల్లో పట్టు కోల్పోతున్నారనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
టీఆర్‌ఎస్ ఘటనపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సైతం స్పందించారు. ఈ క్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. భౌతిక దాడులకు దిగి రౌడీయిజం చేస్తారా?. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మలు దాడులతో ప్రశ్నించే గొంతును నొక్కాలనుకుంటున్నారు. బీజేపీ సహనాన్ని చేతకానితనం అనుకోవద్దు. మా కార్యకర్తలు బరిలోకి దిగితే తట్టుకోలేరు అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి ఘటనపై డీకే అరుణ కూడా స్పందించారు. డీకే అరుణ మాట్లాడుతూ.. దాడికి కారణమైన కవితపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడుల నేపథ్యంలో హైదరాబాద్, ఆర్మూర్‌లోని అరవింద్ నివాసాల వద్ద పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.