Credits: Google

Hyderabad, Nov 18: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ఆమోదించిన బిల్లులకు (Bills) ఆమోదముద్ర వేసే విషయంలో గవర్నర్ (Governor) తమిళిసై (Tamilisai) ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పలు బిల్లులకు ఆమోదం తెలపకుండా తన వద్దే ఉంచుకుంటున్నారు. పూర్తి క్లారిటీ ఉంటేనే ఆమోదిస్తున్నారు. ఈ క్రమంలో... రాజ్ భవన్ (RajBhavan) కు రావాలంటూ తాజాగా ఆరోగ్యమంత్రి హరీష్ రావు (Harish Rao)కు పిలుపు వచ్చింది. మెడికల్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగ విరమణ వయస్సును పెంచుతూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై తమిళిసై అసంతృప్తితో ఉన్నారు.

రేప్ కేసులో శ్రీలంక క్రికెటర్ కు ఊరట.. గుణతిలకకు బెయిల్ మంజూరు చేసిన సిడ్నీలోని కోర్టు

టీచింగ్ స్టాఫ్ తో పాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పోస్టుల రిటైర్మెంట్ వయస్సును పెంచడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే హరీశ్ కు రాజ్ భవన్ కు రావాలంటూ పిలుపు వచ్చింది. బిల్లుకు సంబంధించి మంత్రి నుంచి ఆమె వివరణ కోరనున్నారు. బిల్లు విషయానికి వస్తే... వయో పరిమితిని 62 నుంచి 65 ఏళ్లకు పెంచడం జరిగింది.