TRS Formation Day: రెండు దశాబ్దాల టీఆర్ఎస్, పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేసిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, నిరాడంబరంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఉత్సవాలు
ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన ‘తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) సోమవారం 20వ వసంతంలోకి అడుగుపెట్టింది. కరోనా నీలి నీడలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో ఈ వేడుకలను అత్యంత నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ (TRS President K Chandrashekhar Rao) పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వేడుకలు నిరాడంబరంగా సాగాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (telangana rashtra samithi) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు సోమవారం తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు.
Hyderabad, April 27: ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన ‘తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) సోమవారం 20వ వసంతంలోకి అడుగుపెట్టింది. కరోనా నీలి నీడలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో ఈ వేడుకలను అత్యంత నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ (TRS President K Chandrashekhar Rao) పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో వేడుకలు నిరాడంబరంగా సాగాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (telangana rashtra samithi) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు సోమవారం తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు.
తెలంగాణ తల్లి (Telangana Talli) విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం ప్రొ. జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీఆర్‌ఎస్ నేటితో రెండు దశబ్దాలు (TRS 20th Formation Day) పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
Here's TRS Party Video
CM KCR hoists party flag on 20th TRS formation day at Telangana Bhavan
అయితే కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ కే కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్‌తో పాటు పాల్గొన్న నేతలందరూ మాస్కులు ధరించి, సామాజిక దూరాన్ని పాటించారు. తెలంగాణలో వెయ్యి దాటిన కోవిడ్-19 కేసులు, గత 24 గంటల్లో కొత్తగా 11 పాజిటివ్ కేసులు నమోదు, అన్ని కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనివే
సరిగ్గా రెండు దశాబ్దాల కిందట 2001 ఏప్రిల్ 27న ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్.. ఉద్యమ పార్టీని స్థాపించారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవికి 2001 ఏప్రిల్ 21న రాజీనామా చేసి వారం రోజుల్లోనే పార్టీ ప్రకటించారు. అనంతరం అన్ని వర్గాలను కలుపుకొని పోతూ ఉద్యమాన్నిముందుకు తీసుకెళ్లారు.
Pics from agitation for Telangana statehood
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందిన టీఆర్‌ఎస్ రెండు దశాబ్దాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. స్వాతంత్య్రం తర్వాత జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో రెండు దశాబ్దాలుగా మనుగడ సాధించిన పార్టీలు వేళ్లపై లెక్కపెట్టే సంఖ్యలోనే ఉన్నాయి. రెండు దశాబ్దాలకు పైబడి ప్రజా జీవితంలో ఉన్న ఒకపార్టీకి ఇంత ఆదరణ, అభిమానం లభించడం అపురూపం. ప్రస్తుతం 60లక్షల మంది కార్యకర్తలతో టీఆర్‌ఎస్‌ను అజేయశక్తిగా నిలిపిన కార్యకర్తలు, ప్రజలకు శిరసువంచి పాదాభివందనం చేస్తున్నానని ఈ సంధర్భంగా ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు.
Here's KTR Tweet
అటు తెలంగాణ ఉద్యమానికి పిడికిలి బిగించి.. జంగు సైరన్లతో జైకొట్టిన ప్రతి ఒక్కరికీ వందనాలు అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నాటి 'జలదృశ్యం' నుంచి నేటి 'సుజల దృశ్యం' వరకు అంటూ ఓ ఫోటో పోస్టు చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు ఆవిర్బావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)