TRS MLA Nomula Narsimhaiah Dies: టీఆర్ఎస్ పార్టీలో విషాదం, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గుండెపోటుతో కన్నుమూత, సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
ఆ పార్టీకి చెందిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) గుండెపోటుతో (TRS MLA Nomula Narsimhaiah Dies) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటనే నోములను అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ నోముల నర్సింహయ్య మృతి చెందారు.
Hyderabad, Dec 1: టీఆర్‌ఎస్ పార్టీలో విషాదం నెలకొంది. ఆ పార్టీకి చెందిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) గుండెపోటుతో (TRS MLA Nomula Narsimhaiah Dies) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటనే నోములను అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ నోముల నర్సింహయ్య మృతి చెందారు.
నోముల నర్సింహయ్య మొదటసారిగా 1987లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గ కేంద్ర మండలం అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. అనంతరం 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మార్క్సిస్టు పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభ పక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై గొంతు ఎత్తారు. తిరిగి మూడో పర్యాయం 2018 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గ నుంచి విజయం సాధించి ప్రస్తుతం శాసనసభ్యుడు గా (TRS MLA from Nagarjunasagar) కొనసాగుతున్నారు. సామాన్య మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించి ఆయన న్యాయశాస్త్ర పట్టభద్రుడుగా ఉన్నారు.
Here's The Hindu Tweet
ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణం పట్ల (TRS MLA Nomula Narsimhaiah Passed Away) సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా నిలిచి పోతారని సీఎం (CM KCR) అన్నారు. ఆయన మరణం టీఆర్‌ఎస్ పార్టీకి, నియోజక వర్గం ప్రజలకు తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నోముల నర్సింహయ్య అంత్యక్రియలు బుధవారం నకిరేకల్ మండలంలోని పాలెం గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్ హైదర్గూడ అపోలో ఆస్పత్రిలో నోముల పార్థివదేహాన్ని హైదరాబాద్లోని కొత్తపేట నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం నర్సింహయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న సాగర్ నియోజకవర్గమైన హాలియా మండల కేంద్రంలోని ఆయన నివాసానికి తరలించనున్నారు. బుధవారం సాయంత్రం నకిరేకల్‌కు తరలించి ఆయన వ్యవసాయ క్షేత్రమైన పాలెంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు