MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్, తీర్పు తుది కాపీ వచ్చేదాకా ఆదేశాలను సస్పెన్షన్‌లో ఉంచాలని తెలిపిన హైకోర్టు, అప్పటివరకు తీర్పును ఇంప్లిమెంట్‌ చేయొద్దని కోరిన సిట్‌ తరపున రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌

కేసు సీబీఐ కి ఇస్తూ ఇచ్చిన ఆదేశాలను సస్పెన్షన్‌లో ఉంచాలని, తీర్పును ఇంప్లిమెంట్‌ చేయొద్దని సిట్‌ తరపున రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ కోరారు. దీనికి హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు.

High Court for the state of Telangana. | Photo- Wikimedia Commons.

Hyd, Dec 26: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (TRS MLA Poaching Case) సీబీఐ చేతికి వెళ్లాలన్న ఆదేశాలు వెలువడిన కాసేపటికే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల తుది కాపీ వచ్చేదాకా.. కేసు సీబీఐ కి ఇస్తూ ఇచ్చిన ఆదేశాలను సస్పెన్షన్‌లో ఉంచాలని, తీర్పును ఇంప్లిమెంట్‌ చేయొద్దని సిట్‌ తరపున రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ కోరారు. దీనికి హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు.

ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక మలుపు, కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేసిన తెలంగాణ హైకోర్టు, సిట్‌ విచారణ నిలిపివేయాలంటూ ఆదేశాలు

ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు.. ఆర్డర్‌ కాపీ అందిన తర్వాతే అప్పీల్‌కు వెళ్తామని ధర్మాసనానికి స్పష్టం చేశారు ఏజీ. దీంతో అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఇస్తామని న్యాయమూర్తి ఏజీకి స్పష్టం చేశారు. అంతకు ముందు.. కేసును సిట్‌ దర్యాప్తు నుంచి సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అయితే.. తక్షణమే సీబీఐకి అప్పగించాలని తెలిపినప్పటికీ.. ఏజీ అభ్యర్థనను హైకోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో 5గురికి నోటీసులు, విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్‌ చేస్తామని హెచ్చరికలు జారీ చేసిన సిట్

దీంతో హైకోర్టు ఆర్డర్‌ కాపీ అందిన తర్వాతే సిట్‌ అప్పీల్‌కు వెళ్లనుంది. ఈ పరిణామంతో.. డివిజన్‌ బెంచ్‌లో తీర్పు తర్వాతే సీబీఐ దర్యాప్తు ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక హైకోర్టు ఆర్డర్‌ కాపీ వచ్చిన తర్వాతే తన కార్యాచరణ ప్రకటిస్తామని ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి మీడియాకు తెలిపారు.



సంబంధిత వార్తలు

Allu Arjun Reacts on Sri Tej Health: శ్రీ తేజ్ ఆరోగ్యంపై స్పందించిన అల్లు అర్జున్, ఆ కార‌ణాల‌తోనే అత‌న్ని క‌లువ‌లేక‌పోతున్నా.. అంటూ పోస్ట్

SI Suicide Case: వాజేడు ఎస్ఐ సూసైడ్ కేసులో ప్రియురాలు అరెస్ట్, రాంగ్‌ నెంబర్‌ కాల్ చేసి ఎస్‌ఐకి పరిచయం..ప్రేమ పేరుతో వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా పోలీసుల వెల్లడి

YS Jagan On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన జగన్, ఈ ఘటనకు అర్జున్‌ను బాధ్యుడిని చేయడం సరికాదన్న వైసీపీ అధినేత

Harishrao: జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరం, థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరే కారణం..సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్‌ చేయాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్