Telangana Municipal Election Results 2021: బీజేపీకి షాక్... తెలంగాణలో రెండు కార్పొరేషన్, 5 మున్సిపాలిటీలు టీఆర్‌ఎస్ వశం
రాష్ట్రంలో జరిగిన ఐదుకు ఐదు మున్సిపాలిటీ ఎన్నికల్లో (Telangana Municipal Election Results 2021) టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం ఐదు మున్సిపాలిటీలను సొంతం చేసుకుని (TRS sweeps Telangana Municipal Election polls) గులాబీ పార్టీ సత్తా చాటింది.
Hyderabad, May 3: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) మినీ మున్సిపల్స్ ఎన్నికల్లో సత్తా చాటింది. రాష్ట్రంలో జరిగిన ఐదుకు ఐదు మున్సిపాలిటీ ఎన్నికల్లో (Telangana Municipal Election Results 2021) టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం ఐదు మున్సిపాలిటీలను సొంతం చేసుకుని (TRS sweeps Telangana Municipal Election polls) గులాబీ పార్టీ సత్తా చాటింది.
ఇక వరంగల్, ఖమ్మం కార్పోరేషన్‌లను కూడా టీఆర్‌ఎస్ సొంతం చేసుకోవడంతో గులాబీ శ్రేణుల్లో డబుల్ జోష్ వచ్చింది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్ 51 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 10 సొంతం చేసుకోగా, రెండుచోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. స్వతంత్రులు ముగ్గురు గెలుపొందారు.
ఖమ్మం కార్పొరేషన్‌లో 55 డివిజన్లు ఉండగా అత్యధిక డివిజన్లను అధికార పార్టీ టీఆర్‌ఎస్ సొంతం చేసుకుంది. 45 డివిజన్‌లలో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపొంది కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ 8 డివిజన్లు, బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. స్వతంత్రులు రెండు చోట్ల గెలుపొందారు.
తెలంగాణలో 5 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ విజయం
1. నకిరేకల్ (20):
టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 2, ఇతరులు 6
2. కొత్తూరు (12):
టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5
3. అచ్చంపేట (20):
టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 6, బీజేపీ 1
4. జడ్చర్ల (27):
టీఆర్ఎస్ 23, కాంగ్రెస్ 2, బీజేపీ 2
5. సిద్దిపేట (43):
టీఆర్ఎస్ 36, బీజేపీ 1, ఎంఐఎం 1, ఇతరులు 5
ఈ ఎన్నికలలో 5,84,963 మంది మహిళలతో సహా మొత్తం 11,59,112 మంది ఓటర్లు ఓటు వేయడానికి అర్హులు. 480 మంది స్వతంత్రులతో సహా 1,307 మంది అభ్యర్థులు రెండు కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీలలో బరిలో ఉన్నారు. జిహెచ్‌ఎంసిలోని లింగోజిగుడ వార్డులో పద్నాలుగు మంది అభ్యర్థులు నాలుగు వార్డుల్లో తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించగా, ఐదుగురు అభ్యర్థులు పోటీలో నిలిచారు.