Class 10 Paper Leak: బండి సంజయ్‌పై కుట్ర కేసు నమోదు, భువనగిరి కోర్టుకు తరలింపు, ఈటెల, రఘునందన్ రావు అరెస్ట్

ఈ కేసులో బండి సంజయ్‌ (Bandi Sanjay)ను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు.తాజాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) బీజేపీ కార్యాలయానికి వస్తుండగా హకీంపేటలో పోలీసులు అరెస్టు చేశారు.

Bandi Sanjay Arrest (PIC @ ANI Twitter)

HYd, April 5: టెన్త్ పేపర్ లీకేజీ (Tenth pPaper Leakage) తెలంగాణలో ప్రకంపణలు రేపుతోంది. ఈ కేసులో బండి సంజయ్‌ (Bandi Sanjay)ను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు.తాజాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) బీజేపీ కార్యాలయానికి వస్తుండగా హకీంపేటలో పోలీసులు అరెస్టు చేశారు.బండి సంజయ్‌ను పరామర్శించేందుకు వెళుతున్న నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య వస్తుందని.. అందుకే అరెస్టు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసులో అర్ధరాత్రి హైడ్రామా! బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్, తన అత్త కర్మకోసం వస్తే అరెస్ట్ చేశారంటూ కుటుంబ సభ్యుల ఆందోళన, సీరియస్‌గా తీసుకున్న బీజేపీ హైకమాండ్

అర్ధరాత్రి అక్రమ అరెస్ట్‌ గురైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (BJP Leader Bandi Sanjay)ను పరామర్శించేందుకు వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ (Dubbaka MLA Raghunandan Rao)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పై పోలీసులు కుట్ర కేసు (Conspiracy Case) నమోదు చేసి.. బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ నుంచి భువనగిరి కోర్టు (Bhuvanagiri Court)కు తరలించారు. సంజయ్ కనిపించకుండా కారు అద్దాలకు పేపర్లు అడ్డు పెట్టారు. బండిని తరలిస్తుండగా కారును అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. వారిని బలప్రయోగంతో పోలీసులు చెదరగొట్టారు.

బయటకు వస్తే మాడిపోవాల్సిందే, హైదరాబాద్‌లో మండిపోతున్న ఎండలు, బోరబండలో నిన్న ఏకంగా 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

సంజయ్‌ను వరంగల్‌ తరలిస్తుండగా పెంబర్తి వద్ద పోలీసుల కాన్వాయ్‌ను బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. రోడ్లపై టైర్లు తగలబెట్టి కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసులు వారిపై లాఠీచార్జ్‌ చేశారు. ఈ క్రమంలో పలువురు బీజేపీ నేతలకు గాయాలయ్యాయి. మరోవైపు.. పెంబర్తి వద్ద వరంగల్‌ పోలీసులు.. బండి సంజయ్‌ను హ్యాండోవర్‌ చేసుకున్నారు. కాసేపట్లో బండి సంజయ్‌ను జడ్జి వద్ద ప్రవేశపెట్టనున్నారు పోలీసులు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ (BJP Leader Bandi Sanjay Kumar) అక్రమ అరెస్ట్‌‌పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ బీజేపీ లీగల్ సెల్ (Telangana BJP Legal Cell) ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. బండి సంజయ్‌ (BJP Leader) ను అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ బీజేపీ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో బీజేపీ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ (BJP) పిలుపునిచ్చింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ (BJP Leader Bandi Sanjay Arrest) అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలకు తెలంగాణ బీజేపీ (Telangana BKP)పిలుపునిచ్చింది