TSRTC MD VC Sajjanar: ఆర్టీసీ ఆదాయం పెంచడానికి మహేష్ బాబును వాడేసిన ఎండీ సజ్జనార్, టీ24 టిక్కెట్టుతో సిటీ మొత్తం ప్రయాణించవచ్చంటూ ట్వీట్
సూపర్ స్టార్ మహేశ్ ఫోటోలతో రూపొందిన మీమ్‌లో బైకులో లీటరు పెట్రోలు కొట్టిస్తే సిటీ మొత్తం తిరగలేకపోవచ్చు కానీ లీటరు పెట్రోలు కంటే తక్కువ ధరలో లభిస్తున్న టీ24 టిక్కెట్టుతో సిటీ మొత్తం ప్రయాణించవచ్చని చెబుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
Hyd, Nov 1: గత కొంత కాలంగా డీజిల్, పెట్రోలు ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. ఆ పెరుగుతున్న ధరలను సైతం ఆర్టీసీకి ఆదాయంగా ఎలా మార్చేందుకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (TSRTC MD VC Sajjanar) ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ట్విట్టర్ వేదికగా ప్రత్యేక ప్రచారం ప్రారంభించారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబును ( Mahesh Babu) అందులో పరోక్ష భాగస్వామిగా మార్చారు. ఆర్టీసీ వైపు ప్రయాణికులను ఆకర్షించేలా ప్రిన్స్ మహేశ్ చిత్రాల్లోని ఫోటోలకు అదిరిపోయే క్యాప్షన్ (Travel in TSRTC Safely with less cost) జోడించి మీమ్ రూపొందించారు. దాన్ని తన అధికారిక ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేశారు.
సూపర్ స్టార్ మహేశ్ ఫోటోలతో రూపొందిన మీమ్‌లో బైకులో లీటరు పెట్రోలు కొట్టిస్తే సిటీ మొత్తం తిరగలేకపోవచ్చు కానీ లీటరు పెట్రోలు కంటే తక్కువ ధరలో లభిస్తున్న టీ24 టిక్కెట్టుతో సిటీ మొత్తం ప్రయాణించవచ్చని చెబుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. TSRTC ఎండీగా పదవీ బాధ్యతలు స్వీకరించింది మొదలు నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఒడ్డున పడేసేందుకు సజ్జనార్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. పండగ సమయాల్లో స్పెషల్ పేరుతో ఆర్టీసీ చేసే అదనపు ఛార్జీల వడ్డన కార్యక్రమానికి స్వస్థి పలికారు. ఈ నిర్ణయంతో ఆర్టీసీ బ్రాండ్ ఇమేజ్ పెరగడమే కాకుండా ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల ధరల దోపిడి నుంచి ప్రయాణికులక ఊరట లభించింది.
Here's VC SajjanarTweets
అలాగే టీఎస్ ఆర్టీసీ బస్ స్టేషన్లలో మిల్క్ ఫీడింగ్ కియోస్క్‌లను ఏర్పాటు చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ప్రయాణికులకు ఆర్టీసీ మాది అనే భావన కలిగిస్తున్నాయి. ఇప్పటికీ మిల్క్ ఫీడింగ్ కియోస్క్ ఎంజీబీఎస్‌లో మొదలవగా మిగిలిన స్టేషన్లకు త్వరలో విస్తరించనున్నారు.