War of words between Congress and BJP leaders in telangana(X)

Hyd, Feb 15:  తెలంగాణలో కాంగ్రెస్ - బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం(Congress Vs BJP) తారాస్థాయికి చేరింది. మోడీ పుట్టుకతో బీసీ కాదు.. ముఖ్యమంత్రి అయ్యాక లీగల్లి కన్వర్టెడ్ బీసీ అని, నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని బీసీలో కలుపుకున్నాడు అని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

దీనికి బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ ఒక ముస్లిం, వాళ్ళ అమ్మ ఒక క్రైస్తవురాలు ఇటలీ దేశస్తురాలు అని మండిపడ్డారు కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay). మోడీ ఒరిజినల్ బీసీ కాదు అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. మీ అధినాయకుడు రాహుల్ గాంధీ ఏ కులం, ఏ మతం, ఏ దేశానికి చెందిన వ్యక్తి అనేది స్పష్టం చేయాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ముస్లింలను బీసీల్లో కలిపితే మేము, కేంద్రం ఒప్పుకోదు.. ముస్లింలను బీసీల్లో నుండి తీసేసి మోడీ దగ్గరికి రండి అని చురకలు అంటించారు. రాజాసింగ్‌కు పార్టీలో అన్యాయం జరిగింది అనేది ఆయన అంతర్గత విషయం.. దానిపై పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారు అన్నారు.

దీపాదాస్ మున్షీ క్రమశిక్షణ గల నాయకురాలు..తప్పుడు ప్రచారం సరికాదన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తప్పుడు వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక

బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాలలో వచ్చిన వ్యతిరేకత కంటే ఎక్కువ సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం మీద వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)అన్నారు. మా పార్టీలో కొందరు బీసీ నాయకులు అతితెలివితో మాట్లాడుతారు, దాన్ని అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పరోక్షంగా రాజాసింగ్‌కు కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి.

రాజసింగ్ ఇంటర్నల్ గా మాట్లాడాల్సిన విషయాలు, మీడియా లో మాట్లాడడం వల్ల అతని క్రమశిక్షణ ఏంటో తెలుస్తుందన్నారు. అంతకముందు బీజేపీ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై రాజాసింగ్ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. బీజేపీ పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నాను..

పార్టీకి నువ్వు అవసరం లేదు వెళ్ళిపో అంటే ఇప్పుడే పార్టీకి రాజీనామా చేస్తానన్నారు. బీజేపీనీ వదిలి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను.. పార్టీలో కొంతమంది చేస్తున్నట్టు నాకు బ్రోకరిజం చేయడం రాదు అని రాజాసింగ్ .. ఆరోపించిన సంగతి తెలిసిందే.

బీజేపీ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Goud) కౌంటర్ ఇచ్చారు. పుట్టుకతో మోడీ బీసీ కాదు... ఓబీసీ ముసుగు వేసుకున్న మోడీ బీసీలకు చేసిందేమీ లేదు అన్నారు. కుల గణన దేశ చరిత్రలో నిలిచిపోయే అంశం.. కేంద్రమంత్రి బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారు అన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లు చట్టబద్దం అయ్యేలా చూడాలి.. బీజేపీ నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి అన్నారు. ప్రధాన మంత్రికి ఇవ్వాల్సిన గౌరవాన్ని కాంగ్రెస్ ఇస్తోందన్నారు.

రాహుల్ గాంధీ కులంపై కిషన్ రెడ్డి కామెంట్స్ ను ఖండించారు హన్మంతరావు(V Hanumantharao). రాహుల్ గాంధీది బడుగు బలహీన వర్గాల కులం.. బడుగు బలహీన వర్గాల గురుంచి ఆలోచించే శక్తి కేవలం కాంగ్రెస్, గాంధీ కుటుంబానికే ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన చేస్తారా? లేదా? అన్నది బీజేపీ నేతలు చెప్పాలి.. మీ రాష్ట్రాలలో కులగణన చేస్తారా?లేదా?బీజేపీ నాయకులు చెప్పాలి అన్నారు. ఇప్పటికైన కిషన్ రెడ్డి ఇలాంటి స్టేట్మెంట్లు బంద్ చేయాలని చురకలు అంటించారు వీహెచ్‌.