Karunya Scheme: మరణించిన టీఎస్ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు గుడ్ న్యూస్, కారుణ్య నియామకాలపై ఆర్టీసీ కీలక నిర్ణయం, త్వరలోనే జాబ్స్ ఇస్తామంటూ ప్రకటన, సర్కూలర్ జారీ చేసిన టీఎస్ఆర్టీసీ

ఈ మేర‌కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ (Sajjanar) గురువారం సర్క్యూలర్‌ విడుదల చేశారు.

TSRTC Image used for representational purpose only |Photo Wikimedia Commons

Hyderabad, July 08: ఎన్నో ఏళ్లుగా పెండింగ్ పడుతూ వస్తున్న ఆర్టీసీ కారుణ్య నియామకాలకు(karunya Jobs) లైన్ క్లియర్ అయింది. మరణించిన కుటుంబ సభ్యులకు ఉద్యోగాల విషయంలో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో టీఎస్‌ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఎట్టకేలకు(compassionate appointments) అనుమతి లభించింది. కార్పొరేషన్‌ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఉద్యోగంలోకి తీసుకోనున్నారు. ఈ మేర‌కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ (Sajjanar) గురువారం సర్క్యూలర్‌ విడుదల చేశారు. కొవిడ్ -19 విపత్కర పరిస్థితులు, డీజిల్‌, ఇతర ఖర్చుల పెరుగుదల, ఉద్యోగుల క్రమబద్ధీకరణతో(Regularization) సంస్థకు అదనపు సిబ్బంది అవసరం పెరిగిందని, ఈ మేరకు 2019 నుంచి పెండింగ్‌లో ఉంటూ వస్తున్న కారుణ్య నియామకాలను భర్తీ చేయాలని సంస్థ నిర్ణయించినట్లు స‌జ్జ‌నార్‌ పేర్కొన్నారు.

RTC Dispute Row:దెబ్బకు దెబ్బ..దిగొచ్చిన తమిళనాడు ఆర్టీసీ, ఆఘమేఘాల మీద ఎపీఎస్ఆర్టీసీతో చర్చలు, సద్దుమణిగిన వివాదం, ఆర్టీసీ బస్సులను వదిలేసిన రెండు రాష్ట్రాల అధికారులు

ఉద్యోగి మరణించిన తేదీ ఆధారంగా సీనియారిటీని అనుసరించి కారుణ్య నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఉద్యోగి కుటుంబ సభ్యుల అర్హతలను అనుసరించి డ్రైవర్‌ గ్రేడ్ – 2, కండక్టర్‌ గ్రేడ్‌-2, ఆర్టీసీ కానిస్టేబుల్‌, శ్రామిక్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. డ్రైవర్లకు రూ.19వేలు, కండక్టర్లకు రూ.17వేలు, ఆర్టీసీ కానిస్టేబుళ్లు, శ్రామిక్‌లకు రూ.15వేల చొప్పున జీతాలు ఇవ్వనున్నారు.

Telugu States RTC Meeting: తెలంగాణకు ఏపీ నుంచి బస్సులు ఇప్పట్లో కష్టమే, రెండు రాష్ట్రాల ఆర్టీసీ కీలక భేటీ వాయిదా, మళ్లీ భేటీ ఎప్పుడు అనేదానిపై కొనసాగుతున్న సస్పెన్స్ 

కారుణ్య నియామకాలు పొందిన సిబ్బంది మూడేళ్ల పనితీరు ఆధారంగా వారిని రెగ్యులర్‌ చేయనున్నారు. ప‌ర్ఫార్మెన్స్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ నిర్వహించి అందులో 60శాతం మార్కులు సాధించడంతో పాటు, ప్రతి ఏడాది 240 రోజులు పనిచేసిన వారు, ప్రయాణికులతో వారి ప్రవర్తనను ఆధారంగా చేసుకొని రెగ్యులరైజ్‌ చేస్తారు. వచ్చిన దరఖాస్తుల్లో సీనియారిటీని అనుసరించి సంస్థ అవసరాల మేరకు విడతల వారీగా పోస్టులను భర్తీ చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif