
Hyderabad, June 24: కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన అంతర్రాష్ట్ర సర్వీసులు ( inter state bus services) తిరిగి ప్రారంభమవుతాయని భావించిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరోసారి నిరాశే ఎదురైంది. బుధవారం హైదరాబాద్‌లో జరగాల్సిన కీలక భేటి (Telugu States RTC Meeting) కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. రూ.15 వేలు నేరుగా అకౌంట్లోకి, వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని లాంచ్ చేయనున్న ఏపీ సీఎం, 2,35,873 మంది బ్యాంకు ఖాతాలకు రూ.354 కోట్లు జమ
లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిప్పేందుకు ప్రభుత్వాలు సన్నద్ధం అయ్యాయి. ఇందులో భాగంగానే గతవారం విజయవాడలో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు (AP Telangana RTC Higher Official Meeting) సమావేశమై అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చించుకున్నారు.
కాగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య చర్చలు ప్రారంభం కావడంతో రెండు రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలు పునరుద్ధరిస్తారని అందరూ భావించారు.అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల బుధవారం జరగాల్సిన కీలక భేటీ వాయిదా పడింది. ఈ వారంలో అధికారులు మళ్లీ భేటీ అయ్యేలా కనిపించడం లేదు. దీనితో అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభించేందుకు మరొకొన్ని రోజులు సమయం పట్టేలా కనిపిస్తోంది.! తెలంగాణలో మరల ఒకేరోజులో 879 పాజిటివ్ కేసులు, రాష్ట్రంలో 9.5 వేలు దాటిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య , 220కి పెరిగిన కరోనా మరణాలు
ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఇప్పట్లో తిరిగి ప్రారంభం కావడం కష్టమేనని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో కరోనా వైరస్ రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ నేపథ్యంలో అంతరాష్ట్ర బస్సులను నడపడానికి సీఎం కేసీఆర్ అంగీకరించపోవచ్చని భావిస్తున్నారు. కాగా, తెలంగాణలో జిల్లాల్లో ఇప్పటికే బస్సులు తిరుగుతున్నాయి. రేపట్నించి తెలంగాణలో 6వ విడత హరితహారం, నర్సాపూర్ అటవీ పునరుద్ధరణకు మొక్క నాటి కార్యక్రమం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో... సిటీలో బస్సులను, మెట్రో రైళ్లను నడిపేందుకు ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఐతే... రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడిపినా సమస్యేమీ ఉండదనే అభిప్రాయం ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి వస్తుండటంతో... సర్కారు ఆ దిశగా చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.