APSRTC Buses. (Photo Credit: PTI)

Amaravati. Jan 16: పండుగ సమయంలో తమిళనాడు రవాణాశాఖ ఏపీ బస్సులను నిలిపివేస్తూ (RTC Dispute Row) సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. చెన్నైకు వెళ్లిన రెండు ఆర్టీసీ బస్సులను పర్మిట్ లేదంటూ అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ఫైర్ అయింది. వెంటనే తమిళనాడుకు చెందిన 16 బస్సులను (Tamil nadu rtc bus) పర్మిట్లు లేవంటూ ఆపేసింది. ఈ దెబ్బతో తమిళనాడు అధికారులు దిగొచ్చారు. వెంటనే ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో చర్చలకు (RTC officials talks) దిగారు. రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య చర్చలు సఫలం కావడంతో వివాదం ముగిసింది.

రెండు రాష్ట్రాల మధ్య అంతర్‌రాష్ట్ర ఒప్పందం ఉన్నా.. చిన్న కారణాలతో తమిళనాడు అధికారులు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను (APSRTC) ఆ రాష్ట్రంలో నిలిపేశారు. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ఏపీఎస్‌ఆర్టీసీ తమిళనాడుకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న సంగతి తెలిసిందే. బస్సులో పర్మిట్‌ లేదనే కారణంతో తిరుపతి డిపోకు చెందిన మూడు, చిత్తూరు డిపోకి చెందిన రెండు ఆర్టీసీ బస్సులను తమిళనాడు ఆర్టీఏ అధికారులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులు చెప్పడంతో తమిళనాడు అధికారులతో చర్చలు జరపాలని రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సూచించారు.

వారికి వ్యాక్సిన్ ఇవ్వొద్దని తెలిపిన కేంద్రం, నేడే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్, పల్స్‌ పోలియో కార్యక్రమం జనవరి 31వ తేదీకి వాయిదా, టీకా తీసుకునే ఆరోగ్య కార్యకర్తలతో సంభాషించనున్న ప్రధాని మోదీ

మన ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడం వెనుక ప్రైవేటు ట్రావెల్స్‌ మాఫియా ప్రమేయం ఉందని భావించిన రవాణాశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి తమిళనాడుకు చెందిన ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్‌పై తనిఖీలు ముమ్మరం చేసి 24 బస్సులను సరైన పర్మిట్లు లేవని నిలిపేశారు. ఈలోగా రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలప్రదం అయ్యాయి. దీంతో రెండు రాష్ట్రాల అధికారులు ఆర్టీసీ బస్సులను వదిలేశారు.