Farmers Electrocuted in Mahabubabad: మహబూబాబాద్‌లో విషాదం, విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు దుర్మరణం, మరోచోట కూక‌ట్‌ప‌ల్లిలోని ప్ర‌శాంత్ న‌గ‌ర్ పారిశ్రామిక‌వాడ‌లో భారీ అగ్నిప్ర‌మాదం

పొలంలో విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు దుర్మరణం చెందారు.

Image used for representational purpose | (Photo Credits: PTI)

Mahabubabad, July 10: తెలంగాణ మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం శివారు ప్రాంతమైన భోజ్య తండాలో విషాదం (Two farmers electrocuted in Mahabubabad) చోటు చేసుకుంది. పొలంలో విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు దుర్మరణం చెందారు. వ్యవసాయ మోటారు స్టార్టర్‌కు ఫీజులు వేసే క్రమంలో బోరుకు తగులుకొని ఉన్న జే తీగకు విద్యుత్‌ సరఫరా అయింది. దీంతో తండాకు చెందిన భుక్యా సుధాకర్(28)‌, మాలోత్‌ యాకూబ్‌(40) అక్కడికక్కడే మృతి (farmers electrocuted in Mahabubabad) చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

యాకుబ్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు, సుధాకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. థోర్రూర్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను శవపరీక్ష కోసం మహాబూబాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా యాకుబ్ యొక్క పొలాలలో విద్యుత్తును సరఫరా చేయడానికి స్తంభాలను మంజూరు చేయమని చేసిన విజ్ఞప్తికి ట్రాన్స్కో అధికారులు స్పందించలేదని బంధువులు ఆరోపించారు.

పెను విషాదం..సరయూ నదిలో పన్నెండు మంది గల్లంతు, ఆరుగురు మృత్యువాత, ముగ్గురు సేఫ్, కానరాని మరో ముగ్గురి ఆచూకి, రెండో రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు

ఇక కూక‌ట్‌ప‌ల్లిలోని ప్ర‌శాంత్ న‌గ‌ర్ పారిశ్రామిక‌వాడ‌లో శ‌నివారం మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. జీఎస్ఎన్ లైఫ్‌సైన్స్ ఫార్మా కంపెనీలో అగ్నికీల‌లు ఎగిసిప‌డుతున్నాయి. మంట‌ల ధాటికి భ‌యంతో కార్మికులు బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. ప‌క్క‌నే ఉన్న ఇంటీరియ‌ర్ వ‌స్తువుల దుకాణానికి మంట‌లు వ్యాపించాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుంది. రెండు ఫైరింజ‌న్ల‌తో మంట‌ల‌ను అదుపు చేస్తున్నారు. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కారణాలు తెలియాల్సి ఉంది.



సంబంధిత వార్తలు