154 Stones in Kidney: వామ్మో ఒకే కిడ్నీలో 154 రాళ్లు, హైదరాబాద్‌లో రోగికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు, ఒక్కోరాయి ఎంతుందంటే?
ఏకంగా 154 రాళ్లు (Kidney Stones) బయటపడ్డాయి. సికింద్రాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (Urologists) హాస్పిటల్‌లోని యూరాలజిస్టులు ఆ వ్యక్తికి విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించి రాళ్లను తొలగించారు. బాధిత వ్యక్తి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది.
Hyderabad, April 28: ఓ వ్యక్తి కిడ్నీలో ఒకట్రెండు రాళ్లు కాదు.. ఏకంగా 154 రాళ్లు (Kidney Stones) బయటపడ్డాయి. సికింద్రాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (Urologists) హాస్పిటల్‌లోని యూరాలజిస్టులు ఆ వ్యక్తికి విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించి రాళ్లను తొలగించారు. బాధిత వ్యక్తి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. రామగుండం వాసి అయిన 45 ఏండ్ల వ్యక్తి.. గత కొంతకాలం నుంచి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతను ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ వైద్యులను సంప్రదించాడు. రోగికి సీటీ స్కాన్ పరీక్షలు నిర్వహించగా, రైట్ కిడ్నీలో అధిక మొత్తంలో రాళ్లు (Kidney Stones) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇందులో ఒక రాయి 62 ఎంఎం, 39 ఎంఎం ఉన్నట్లు నిర్ధారించారు. ఎండోస్కోపి సర్జరీ నిర్వహించి మొదటగా ఆ రాయిని బ్లాస్ట్ చేశారు. అనంతరం మిగతా రాళ్లను తొలగించారు.
మొత్తం ఆ రోగి కిడ్నీలో నుంచి 154 రాళ్లను తొలగించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ రాఘవేంద్ర కులకర్ణి మాట్లాడారు. రోగికి షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో లేవని తెలిపారు. ఇక కిడ్నీలో కూడా రాళ్లు ఉండటంతో ఇతర వ్యాధులు సంభవించే అవకాశం ఉంది.
అంతే కాకుండా కిడ్నీకి గాయం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. డయాలసిస్ అవసరం కూడా ఏర్పడుతుంది. షుగర్ ఉన్న వారిలో ఇలాంటి పరిస్థితులు తీవ్ర ఇబ్బందులను కలగజేస్తాయి. కాబట్టి అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి, రోగి కుడి కిడ్నీలో నుంచి 154 రాళ్లను తొలగించినట్లు డాక్టర్ రాఘవేంద్ర పేర్కొన్నారు.