రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 8 గంటల వరకు సచివాలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. దీంతో సచివాలయం వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు.ఈ నెల 30న సీఎం కేసీఆర్ (CM KCR) చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అదేరోజు నుంచి కొత్త సచివాలయంలో పాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ నూతన సచివాలయం (Telangana New Secretariat) సాగర తీరాన ఠీవీగా నిలిచింది. సంప్రదాయ, ఆధునిక సౌందర్యాల కలబోతతో రూపుదిద్దుకున్న.. కొత్త సచివాలయం డ్రోన్ విజువల్స్‌ను మీరూ చూసేయండి.
Here's Video
తెలంగాణ ఆత్మగౌరవానికి పతాక, ప్రగతి వైభవ ప్రతీకగా నిలిచింది తెలంగాణ కొత్త సచివాలయం.
సకల హంగులతో నిర్మితమైన సచివాలయం సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభం.
నాడు సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన నేడు స్వరాష్ట్రంలో పురోగమిస్తోన్న శుభతరుణం. pic.twitter.com/jtRIZBCsCV
— B Vinod Kumar (@vinodboianpalli) April 28, 2023
తెలంగాణ చరిత్రపుటలో మరో అద్భుత కట్టడం... డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం.
The iconic Dr. B.R. Ambedkar Telangana State Secretariat is all set for inauguration. pic.twitter.com/PVqrNv9EUr
— BRS Party (@BRSparty) April 28, 2023
►తెలంగాణ ఖ్యాతిని, హైదరాబాద్ విఖ్యాతిని నలుదిశలా చాటేలా.. రాష్ట్ర సచివాలయం కార్యరూపం దాల్చింది. నవ్య పాలనా ప్రాసాదం ప్రారంభానికి సిద్ధమైంది. బయటి నుంచి చూపరుల కళ్లను ఎంతలా కట్టి పడేస్తుందో.. లోపలికెళితే అత్యాధునిక సౌకర్యాలూ అంతే అబ్బురపరుస్తాయి. pic.twitter.com/LmuWudMOPr
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) April 28, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)