Krishna Water Row: కోర్టు కేసుల విచారణ నేపథ్యంలో గోదావరి-కృష్ణా బోర్డు సమావేశానికి హాజరుకాలేం, కేఆర్ఎంబీకి మరోసారి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం, మరో తేదీని ఖరారు చేయాలని విజ్ఞప్తి
కోర్టు కేసుల విచారణ నేపథ్యంలో ఆగస్టు 9న జరిగే గోదావరి-కృష్ణా బోర్డు సమావేశానికి హాజరుకాలేమని (we can't attend to Godavari-Krishna Board Meeting) తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి కృష్ణా, గోదావరి బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం (TS Govt) లేఖలు రాసింది. బోర్డు చైర్మన్లకు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారు.
Hyderabad, August 8: కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. కోర్టు కేసుల విచారణ నేపథ్యంలో ఆగస్టు 9న జరిగే గోదావరి-కృష్ణా బోర్డు సమావేశానికి హాజరుకాలేమని (we can't attend to Godavari-Krishna Board Meeting) తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి కృష్ణా, గోదావరి బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం (TS Govt) లేఖలు రాసింది. బోర్డు చైర్మన్లకు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారు.
మరోరోజు ఈ సమావేశం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇటీవల కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు (KRMB) తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. 2021-22 ఏడాదికి కృష్ణా జలాలు 50:50 నిష్పత్తిలో పంచాలని ప్రభుత్వం కోరింది. ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50 శాతం కేటాయించాలని ఈఎన్‌సీ (ENC) కోరింది. ఇతర బేసిన్లకు కృష్ణా జలాలను ఏపీ తరలించకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసుల విచారణ ఉన్నందున సోమవారం తలపెట్టిన బోర్డు భేటీకి హాజరు కాలేమని నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ గతంలోనే లేఖలు రాశారు. అయితే కార్యాచరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్న కేంద్ర జల్‌శక్తి శాఖ ఆదేశాల నేపథ్యంలో సమయాభావం వల్ల సమావేశాన్ని నిర్వహిస్తామని.. హాజరుకావాలని కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలు రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లీ లేఖ రాశాయి.
శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా, గోదావరి బోర్డులకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరోమారు లేఖలు రాసింది. రెండు బోర్డుల ఛైర్మన్లకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ విడివిడిగా లేఖలు రాశారు. కేసుల విచారణ కారణంగా సోమవారం నిర్వహించే సమావేశానికి హాజరు కాలేమని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని లేఖలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర సభ్యులు బోర్డు భేటీకి హాజరై అభిప్రాయాలు చెప్పేందుకు వీలుగా మరో తేదీని సూచించాలని రెండు బోర్డులను కోరారు. పాలనాపరమైన అంశాలతో పాటు కృష్ణా జలాల వినియోగానికి సంబంధించిన అంశాలను కూడా తదుపరి సమావేశ ఎజెండాలో చేర్చాలని కేఆర్ఎంబీ ఛైర్మన్‌ను కోరారు. లేఖల ప్రతులను కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి కార్యాలయానికి కూడా పంపించారు.