BJP Boycott TS Assembly Sessions: తెలంగాణ నూత‌న అసెంబ్లీలో అప్పుడే మొద‌లైన లొల్లి, ఆయ‌న ఉంటే మేము ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌బోమంటూ రాజాసింగ్ ప్ర‌క‌ట‌న‌, స‌మావేశాల‌ను బ‌హిష్క‌రిస్తామ‌ని హెచ్చ‌రిక‌

శనివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. శనివారం ఉదయం 8.30 గంటలకు రాజ్ భవన్ లో ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

MLA Raja Singh (Photo-Video Grab)

Hyderabad, DEC 09: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బీజేపీ బాయ్ (BJP Boycott) కాట్ చేసింది. శనివారం నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నట్లు బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ (Rajasingh) ప్రకటించారు. కాసీం రిజ్వీ వారసుడు అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా (Protem Speaker) ఉంటే తాము ప్రమాణ స్వీకారం చేయబోమని స్పష్టం చేశారు. తనతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. 15నిమిషాల టైం ఇస్తే హిందువులను లేకుండా చేస్తానన్న అక్బరుద్దీన్ ఓవైసీని (Akbaruddin Owaisi) ప్రొటెం స్పీకర్ గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఎంఐఎంకు భయపడే అక్బరుద్దీన్ కు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రొటెం స్పీకర్ గా అవకాశమిచ్చారని ఆరోపించారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ నెత్తి ఎక్కి కూర్చున్న చరిత్ర ఎంఐఎంది అని విమర్శించారు.

 

అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని నియమించారు. శనివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.  శనివారం ఉదయం 8.30 గంటలకు రాజ్ భవన్ లో ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అక్బరుద్దిన్ ఓవైసీ చేత గవర్నర్ తమిలి సై ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Akbaruddin Owaisi: తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీ, కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే వరకు ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం నేత 

అక్బరుద్దిన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో రేపటి నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నట్లు బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ ప్రకటించారు. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా ఉంటే తాము ప్రమాణ స్వీకారం చేయబోమని తేల్చి చెప్పారు.