Telangana Weather Update: తెలంగాణ ప్రజలకు అలర్ట్, వచ్చే ఆరు రోజుల పాటు భారీ వర్షాలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం

ఈ నెల 29 నాటికి తూర్పు మధ్య, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది

Weather Update (photo-PTI)

Hyd, August 26: తెలంగాణలో వచ్చే ఆరు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని (Telangana Rain Update)హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 29 నాటికి తూర్పు మధ్య, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆగస్టు 26, 27 తేదీల్లో ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశం (rain for next 6 days) ఉంది తెలిపింది.

27వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం (Telangana Weather Update) కురిసే అవకాశముందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశముందని వెల్లడించింది.  హైదరాబాద్‌లో భారీ వర్షం, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌, 

ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో 28వ తేదీ నుంచి 29వ తేదీ మధ్య అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇక ఆదిలాబాద్ కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 29 నుంచి 30వ తేదీ మధ్య అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో 30 నుంచి 31వ తేదీ మధ్య అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశముందని తెలిపింది.

ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

31వ తేదీ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ మధ్య రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఉత్తర తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.