Hyd, August 26: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఖైరతారాతాబాద్, పంజాగుట్ట బేగంపేట, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మోస్తరు వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది.వర్షం పడడంతో పలు చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి.అకస్మాత్తుగా కురిసిన వర్షంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
తెలంగాణ వ్యాప్తంగా మరో మూడురోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో వచ్చే మూడురోజులు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణని పలు జిల్లాలకు కూడా వర్ష సూచన ఉన్నా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చినుకు జనాల్ని వణికిస్తోంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఏపీలో ఈ జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది.వర్షం ధాటికి పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం దంచికొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో మరో మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.