Hyderabad Shocker: ఇంట్లోకి దూరి యువతిపై మాజీ ప్రియుడు దారుణం, బట్టలు చింపి కింద పడేసి అత్యాచారయత్నం, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

హైదరాబాద్ నగరంలో అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించడమే కాకుండా లైంగికదాడికి యత్నించాడంటూ మాజీ బాయ్‌ ఫ్రెండ్‌పై ఓ యువతి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ మేరకు నిందితుడిని గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Representative image (Photo Credit- Pixabay)

Hyd, April 14: హైదరాబాద్ నగరంలో అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించడమే కాకుండా లైంగికదాడికి యత్నించాడంటూ మాజీ బాయ్‌ ఫ్రెండ్‌పై ఓ యువతి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ మేరకు నిందితుడిని గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల సమాచారం మేరకు.. పబ్‌లలో గిటారిస్ట్‌గా పని చేస్తున్న లలిత్‌ సెహెగల్‌కు 2016లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్న యువతి (36)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది.

ఇద్దరూ 2021 వరకు ప్రేమలో ఉన్నారు. అదే ఏడాది ఇద్దరి మధ్య బ్రేకప్‌ జరిగి.. ఎవరికి వారే వేర్వేరుగా ఉంటున్నారు. అయితే కొంత కాలంగా సదరు యువతి లలిత్‌ సెహగల్‌ స్నేహితుడితో సన్నిహితంగా మెలుగుతోందని, ఈ విషయంపై నిలదీసేందుకు రాత్రి యువతి ఉంటున్న ఫ్లాట్‌కు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు అరుపులు కేకలతో గొడవపడ్డారు. ఈ సమయంలోనే తన దుస్తులను చించేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించి లైంగికదాడికి యత్నించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

చందానగర్‌లో దారుణం, భార్యను రోడ్డు మీద వెంబడించి కత్తితో నరికి చంపిన భర్త, అనుమానంతోనే హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారణ

ఈ మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు నిందితుడు లలిత్‌ సెహగల్‌పై ఐపీసీ సెక్షన్‌ 376 రెడ్‌విత్‌ 511, 323, 354, 509ల కింద కేసు నమోదు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.