YS Sharmila Meeting: షర్మిల నోటి వెంట జై తెలంగాణ నినాదం, దివంగత వైఎస్సార్ పాలనను తీసుకురావడమే లక్ష్యమంటున్న షర్మిలారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం
ఇప్పటికే నల్లగొండ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించగా..నేడు హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం (Hyderabad And Rangareddy Leaders) నిర్వహించారు.
Hyderabad, Feb 20: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిలారెడ్డి తెలంగాణలో జిల్లాల వారీగా సమావేశాలు (YS Sharmila Meeting) నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించగా..నేడు హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం (Hyderabad And Rangareddy Leaders) నిర్వహించారు.
ఈ సమావేశం ప్రారంభంలో జై తెలంగాణ, జై వైయస్సార్ అని ఆమె నినాదాలు చేశారు. సమావేశానికి హాజరైన నేతలను తెలంగాణ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారా అని ఆరా తీశారు. స్థానిక సమస్యలపై నేతలతో చర్చించారు.11 ప్రశ్నలతో ఉన్న ఫీడ్ బ్యాక్ ఫామ్ ని నింపాలని అభిమానులను ఆమె కోరారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల అమలు విధానంపై అడిగి తెలుసుకున్నారు. కాగా తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్నదే తన ఆక్షాంక్ష అని షర్మిల పేర్కొన్నారు. అలాగే వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి హైదరాబాద్, రంగారెడ్డి నేతలు ఆమెకు వివరించారు.
తెలంగాణలో ఇంకా ఆయనకు అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. కాగా గత గురువారం ఆమె ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. త్వరలోనే అన్ని జిల్లాల నేతలతో సమావేశమవుతానని షర్మిల ఇదివరకే ప్రకటించారు.
షర్మిలారెడ్డి మీటింగ్ సారాంశం: ‘‘తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్నదే నా ఆకాంక్ష. స్థానిక సమస్యలు, టీఆర్‌ఎస్ పాలనపై చర్చించాం. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా వైఎస్సార్ సేవ చేశారు. తెలుగు ప్రజలు అందరినీ వైఎస్సార్ ప్రేమించారు. రైతు రాజు కావాలని, పేదవాడు లక్షాధికారి కావాలనుకున్నారు. పేద విద్యార్థి ఉచితంగా పెద్దచదువులు చదువుకోవాలని వైఎస్ ఆశించారు.
పేదవాడికి అనారోగ్యమైతే భరోసాగా వైఎస్ నిలవాలనుకున్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా వైఎస్సార్ సేవ చేశారు. తెలుగు ప్రజలనందరినీ వైఎస్సార్ ప్రేమించారు. ప్రతి రైతు రాజు కావాలనుకున్నడు వైఎస్సార్. ప్రతి పేదవాడు లక్షాధికారి కావాలనుకున్నాడు. ప్రతి పేద విద్యార్థి ఉచితంగా పెద్ద చదువులు చదువుకోవాలని వైఎస్ ఆశించారు. ప్రతి పేదవాడికి అనారోగ్యం చేస్తే భరోసాగా నిలవాలని వైఎస్ భావించారు’’ అని షర్మిల గుర్తుచేశారు.