YS Sharmila Political Entry Suspense (Photo-Twitter)

Hyderabad, Feb 9: తెలంగాణ లోటప్ పాండ్ లో రావాలి షర్మిల కావాలి షర్మిల నినాదాలతో మోగుతోంది. తెలంగాణలో వైయస్ అభిమానుల రాకతో లోటస్ పాండ్ లో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు రావాలి షర్మిల కావాలి షర్మిల (Ravali Sharmila Kavali Sharmila) ప్లెక్సీలతో దర్శనమిచ్చారు. కాగా కొత్త పార్టీని (YS Sharmila Political Entry Suspence) ప్రారంభించబోతున్న వైయస్ షర్మిల తమ అభిమానుల ముందుకు వచ్చారు. చిరునవ్వుతో అందరికీ ఆమె అభివాదం చేశారు. తన తండ్రి స్టయిల్లో చేతులు ఊపుతూ హుషారెత్తించారు. ఈ సందర్భంగా ఆమెకు పలు ప్రశ్నలు వేసే ప్రయత్నం చేయగా... ఆమె పొడిపొడిగానే సమాధానలు ఇచ్చారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటవేశారు.

అందరూ కాస్త ఓపిక పట్టాలని... అన్ని విషయాలు చెపుతానని ఆమె (YS Sharmila ) అన్నారు. అందరితో తాను మాట్లాడుతున్నానని చెప్పారు. కొత్త పార్టీ పేరు ఏమిటనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వలేదు. తర్వాత చెపుతానంటూ ముందుకు సాగారు. గ్రౌండ్ రియాల్టీ ఏమిటనే విషయం తెలుసుకోవడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణలో రాజన్న లేని లోటు క్లియర్ గా కనిపిస్తోందని... ఆయన రాజ్యాన్ని మళ్లీ తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణలో ప్రతి ఇంటికి వెళ్తానని చెప్పారు. ఈ రోజు నల్గొండ జిల్లా నేతలు, కార్యకర్తలతో ఆమె సమావేశాన్ని నిర్వహించనున్నారు. వారి సూచనలు, సలహాలను తీసుకోనున్నారు.

అన్నని కాదని కొత్త పార్టీ పెడుతోందా? లోటస్ పాండ్‌లో వైయస్ షర్మిలారెడ్డి ఆత్మీయ సమావేశం, దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి పెళ్లి రోజు నేడు, జగనన్న వదిలిన బాణం ఏం చేయబోతోంది?

మరోవైపు కొత్త పార్టీపై కార్యకర్తలకు ఆమె దిశానిర్దేశం చేయబోతున్నారు. రానున్న 30 రోజులు పార్టీ నిర్మాణంపై దృష్టిని సారించనున్నట్టు తెలుస్తోంది. పార్టీ ప్రకటన కోసం భారీ బహిరంగసభను నిర్వహించే అవకాశం ఉంది. వైయస్సార్, తెలంగాణ పేర్లు కలిసి వచ్చేలా పార్టీ పేరు ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. 100 నియోజకవర్గాల్లో 16 నెలల పాటు పాదయాత్ర చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల ఇవాళ లోటస్‌పాండ్‌లో ఆత్మీయ సమ్మేళనం టీఆర్‌ఎస్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది. షర్మిలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అన్న (వైఎస్ జగన్ మోహన్ రెడ్డి) అన్యాయం చేస్తే ఆంధ్రాకు వెళ్లాలంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తెలంగాణలో ఏంచేస్తారని సెటైర్‌ల వర్షం కురిపిస్తున్నారు.

తెలంగాణలో వేరే పార్టీకి పుట్టగతులు ఉండవు..ఇక్కడ టీఆర్ఎస్ తప్ప మరో పార్టీకి అవకాశమే లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వేరే పార్టీలు రావు.. వచ్చినా బ్రతకవని స్పష్టం చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలు ఇక్కడ నడవవన్నారు. టీఆర్ఎస్‌లో ధిక్కార స్వరమే లేదు..బయట వస్తున్న వార్తలు కరెక్ట్ కాదని కొట్టిపారేశారు.