Onion Price: టమాటో తర్వాత కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. ధరలకు రెక్కలు.. కిలో రూ. 40కి చేరిక
ఏపీలో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి.
Hyderabad, Sep 4: మొన్నటివరకూ టమాటో (Tomato) ధరలతో కుదేలైన సామాన్యులకు ఇప్పుడు ఉల్లి (Onion) కన్నీళ్లు పెట్టిస్తున్నది. ఏపీలో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. రైతు బజార్లలోనే (Raithu Bazar) కిలో రూ. 30 పలుకుతుండగా, బహిరంగ మార్కెట్లో రూ. 35 నుంచి రూ. 40 వరకు విక్రయిస్తున్నారు. మార్చితో పోలిస్తే కిలోకు 150 శాతానికిపైగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లిసాగు తగ్గడం, పొరుగు రాష్ట్రం కర్ణాటకలోనూ కొత్తపంట చేతికి రాకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
Chandramukhi-2: ఆసక్తి రేకెత్తిస్తున్న చంద్రముఖి-2 ట్రైలర్.. మీరూ చూడండి
Viral Video: రైలులో మహిళ పర్సు చోరీ.. కిటికీకి దొంగ వేలాడదీత.. వైరల్ వీడియో
ఆకాశాన్ని తాకుతాయోనన్న భయం
ఇటీవల రూ. 200 వరకు చేరిన కిలో టమాటా ధర ప్రస్తుతం రూ. 35కు పడిపోయింది. దీంతో ఉల్లి ధరలు కూడా ఎక్కడ ఆకాశాన్ని తాకుతాయోనన్న భయం వినియోగదారులను వేధిస్తోంది. ఏపీలోని తాడేపల్లిగూడెం మార్కెట్‌కు రోజుకు 80-90 లారీలు వచ్చేవి. ఇప్పుడు ఉల్లి ఉత్పత్తి తగ్గడంతో ఒకటి రెండు లారీలు మాత్రమే వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.