Youtuber Harsha Sai: బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్ష సాయి.. నేడే విచారణ.. ఏమవుతుందో??

తనపై నార్సింగి పోలీస్ స్టేషన్‌ లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి హైకోర్టును ఆశ్రయించారు.

Complaint on Youtuber Harsha Sai (Credits: X)

Hyderabad, Oct 22: తనపై నార్సింగి పోలీస్ స్టేషన్‌ లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి (Youtuber Harsha Sai) హైకోర్టును (High Court) ఆశ్రయించారు. ఈ మేరకు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌ పై నేడు హైకోర్టులో విచారణ జరుగనున్నట్టు తెలుస్తున్నది. కాగా, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్ష సాయి తనను మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అడ్వకేట్‌ తో కలిసి నార్సింగ్ పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చి మరీ ఆ యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు యూట్యూబర్‌ పై కేసు నమోదు చేశారు. బాధితురాలి నుంచి నార్సింగ్ పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించారు. మరికొన్ని ఆధారాలను సమర్పించాలని బాధితురాలిని పోలీసులు కోరారు.

ప్రభాస్ రాజా సాబ్ నుంచి కొత్త పోస్టర్ విడుదల చేసిన మేకర్స్, గళ్ళ కోటు, నల్ల ప్యాంటు, టీ షర్ట్‌తో అదిరిపోయిన డార్లింగ్ లుక్

ఫ్యాన్స్ నుంచి ప్రాణ హాని

హర్ష సాయి నుంచే కాకుండా అతని ఫాలోవర్స్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ బాధితులు మరోసారి ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి రూ. 2 కోట్లు హర్ష సాయి తీసుకున్నాడని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది.

మా బావగారు మీ బాబుగారు.. బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ 4 సీజన్ చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ గ్లింప్స్‌ విడుదల



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif