Aadhaar Alert: ఆధార్ కార్డుదారులకు అలర్ట్, అడ్రస్ వాలిడేషన్ లేటర్ సేవలను నిలిపివేసిన యుఐడిఎఐ, తదుపరి నోటీస్ వచ్చే వరకు సదుపాయం నిలిపివేత, ఆధార్ కార్డు అప్‌డేట్ ఎలా చేయాలో తెలుసుకోండి

ఆధార్ కార్డులోని చిరునామాను REQUEST FOR ADDRESS VALIDATION LETTER ద్వారా అప్ డేట్ చేయాలని అనుకుంటున్నారా? ఇకపై మీరు దాని ద్వారా అప్ డేట్ (Aadhaar cardholders alert) చేయలేరు.

No more relationship column in Aadhar Reports (Photo-Wikimedia Commons)

ఆధార్ కార్డులోని చిరునామాను REQUEST FOR ADDRESS VALIDATION LETTER ద్వారా అప్ డేట్ చేయాలని అనుకుంటున్నారా? ఇకపై మీరు దాని ద్వారా అప్ డేట్ (Aadhaar cardholders alert) చేయలేరు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడిఎఐ) ఇక నుంచి ఎలాంటి ఆధారాలు/రుజువు లేకుండా చిరునామాను అప్ డేట్ చేయడం (UIDAI suspends this facility to update address) సాధ్యపడదు.  ట్విటర్ లో ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు యుఐడిఎఐ బదులు ఇచ్చింది. యుఐడిఎఐ చేసిన ట్వీట్ ప్రకారం అడ్రస్ వాలిడేషన్ లేటర్ సేవలను నిలిపివేసింది. యూజర్ అహ్మద్ మెమోన్ చేసిన ట్వీట్ కు జూన్ 14న యుఐడిఎఐ సమాధానమిస్తూ ఇలా ట్వీట్ చేసింది..

"‎ప్రియమైన రెసిడెంట్, తదుపరి నోటీసు వచ్చేవరకు అడ్రస్ వాలిడేషన్ లేటర్ సదుపాయం నిలిపివేయబడింది. ఈ జాబితాలో చెల్లుబాటు అయ్యే PAA డాక్యుమెంట్ ఉపయోగించి దయచేసి మీ చిరునామా అప్ డేట్ ని చేసుకోవచ్చు" ‎అని ట్వీట్ లో పేర్కొంది. మీరు ఆధార్ కార్డు అప్‌డేట్ చేయాలనుకుంటే ఏం ప్రూఫ్ ఉండాలో కూడా అందులో తెలిపింది.ఈ-రూపీ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది

 

Here's UIDAI Reply Tweet:

ఆధార్ కార్డు అప్‌డేట్ ఎలా చేయాలో తెలుసుకోండి

ముందుగా ఆధార్ అడ్రస్ అప్డేట్ పోర్టల్ ssup.uidai.gov.in/ssup/ లోకి లాగిన్ కావాలి.

అక్కడ కనిపించే Proceed to Update Aadhaar ను క్లిక్ చేయాలి.

12 అంకెల యుఐడి నెంబరు నమోదు చేయాలి

సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చా కోడ్ నమోదు చేయాలి

'సెండ్ ఓటీపీ' ఆప్షన్ మీద క్లిక్ చేయాలి

మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుపై ఓటిపి వస్తుంది

రిజిస్టర్డ్ మొబైల్ కు వచ్చిన ఓటీపీ నమోదు చేసి 'లాగిన్' మీద క్లిక్ చేయండి

మీ ఆధార్ వివరాలు చూపిస్తుంది. చిరునామాను మార్చండి, అలాగే చిరునామా రుజువుగా ఆధార్ పేర్కొన్న 32 డాక్యుమెంట్ ల్లో దేనినైనా స్కాన్ కాపీని అప్ లోడ్ చేసి సబ్మిట్ చేయండి