How To Use Disha App: దిశ యాప్ ఎలా వాడాలి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఇంటర్నెట్ లేకుండా పనిచేస్తుందా, పూర్తి వివరాలు మీ కోసం
ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పందిస్తున్న తీరుపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపదలో ఉన్న మహిళల కోసం రూపొందించిన ఈ యాప్‌ను కేవలం నాలుగు రోజుల్లోనే 50 వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.
Amaravati, Febuary 15: మహిళల భద్రత (Women Safety) కోసం ఏపీ ప్రభుత్వం (AP government) ప్రతిష్టాత్మకంగా తీసుకోచ్చిన దిశ యాప్‌పై (Disha App) ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పందిస్తున్న తీరుపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆపదలో ఉన్న మహిళల కోసం రూపొందించిన ఈ యాప్‌ను కేవలం నాలుగు రోజుల్లోనే 50 వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. కాగా ఇంటర్నెట్ ఉన్నా లేకున్నా దిశ ఎస్‌వోఎస్ యాప్ పని చేస్తుంది. ఫోన్‌లో యాప్‌ని తెరిచి ఎస్‌వోఎస్ బటన్ (SOS Button)నొక్కితే ఆ ఫోన్ లొకేషన్ వివరాలు పోలీసు కంట్రోల్ రూమ్‌కు వెళ్తాయి.
రాష్ట్రంలో 4 కోట్లను దాటిన ఓటర్ల సంఖ్య
పోలీసులు స్పందిస్తున్న తీరుకు మెచ్చి గూగుల్ ప్లేస్టోర్‌లో (Google Play Store) 5కి ఏకంగా 4.9 స్టార్ రేటింగ్ ఇచ్చారని దిశ స్పెషల్ ఆఫీసర్ దీపిక పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. . 9వ తేదీ నుంచి సగటున రోజుకు రెండు వేల మందికిపైగా దిశ యాప్ ద్వారా పోలీస్ కమాండ్ రూమ్‌కు టెస్ట్ కాల్స్ చేస్తున్నారని వివరించారు.
ఎస్‌వోఎస్ బటన్ నొక్కడం ద్వారా గానీ, ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ ఊపడం ద్వారా గానీ ఆపదలో ఉన్న మహిళలు దిశ కాల్ సెంటర్‌కు సమాచారం ఇవ్వవచ్చు. ఆ తర్వాత ప్రమాదంలో ఉన్న మహిళలను కాపాడేందుకు దిశ కంట్రోల్ రూమ్ నుంచి పోలీసులకు ఆటోమేటిక్‌గా సమాచారం అందుతుంది. ఇటీవల ఓ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ దిశ యాప్ ద్వారా సాయం కోరగా.. కేవలం ఆరు నిమిషాల్లోనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆమెను వేధిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
డౌన్‌లోడ్ చేయడం, ఉపయోగించడం ఎలా ?
ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోన్ యూజర్లు ప్లేస్టోర్‌లోకి వెళ్లి దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ఇంటర్నెట్ అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్నెట్ ఉన్నా, లేకున్నా మొబైల్ ద్వారా ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఆపదలో ఉన్నవారు ఈ యాప్‌ను ఓపెన్ చేసి అత్యవసర సహాయం(ఎస్‌వోఎస్) బటన్ నొక్కితే చాలు.. వారి ఫోన్ నంబర్, చిరునామా, వారున్న ప్రదేశం వివరాలు దిశ కంట్రోల్ రూమ్‌కు చేరతాయి. ఎస్‌వోఎస్ బటన్ ప్రెస్ చేసే సమయం లేనప్పుడు చేతిలోని ఫోన్‌ను గట్టిగా అటూఇటూ ఊపితే చాలు.. దిశ కమాండ్ రూమ్‌కు సమాచారం చేరుతుంది.
మిలీనియం టవర్స్‌కు రూ.19 కోట్లు విడుదల
ఎస్‌వోఎస్ బటన్‌ను నొక్కితే వాయిస్‌తోపాటు పది సెకన్ల వీడియోను కూడా రికార్డు చేసి కమాండ్ రూమ్‌కు పంపించే వీలు ఉంది. ఎస్‌వోఎస్ బటన్ నొక్కగానే కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్లి.. అక్కడి నుంచి వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు, పోలీస్ రక్షక్ వాహనాలకు ఆటోమేటిక్‌గా కాల్ వెళ్తుంది.మాదంలో ఉన్నవారిని చేరుకోవడానికి జీపీఎస్ అమర్చిన పోలీస్ రక్షక్ వాహనాల్లోని ‘మొబైల్ డేటా టెర్మినల్’ సహాయపడుతుంది.
మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు
అలాగే ఆపదలో ఉన్నప్పుడు సమాచారాన్ని పోలీసులతోపాటు తక్షణం కుటుంబ సభ్యులు/మిత్రులకు పంపేలా ఐదు ఫోన్ నంబర్ల (ఎమర్జెన్సీ కాల్స్)ను దిశ యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. దిశ యాప్‌లోని ‘ట్రాక్ మై ట్రావెల్’ ఆప్షన్ వినియోగిస్తే వారు వెళ్లాల్సిన ప్రాంతాన్ని కూడా నమోదు చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా వారు ప్రయాణిస్తున్న వాహనం వెళ్లాల్సిన ప్రాంతానికి కాకుండా దారి మళ్లితే ఆ సమాచారాన్ని కంట్రోల్ రూమ్, బంధుమిత్రులకు పంపి అప్రమత్తం చేయొచ్చు.
ప్రధాని మోదీతో ఏపీ సీఎం వైయస్ జగన్ భేటీ
ఈ యాప్‌లోనే డయల్ 100, డయల్ 112 నంబర్లను కూడా పొందుపర్చారు. డయల్ 100 అయితే నేరుగా కాల్ చేసి విషయం చెప్పాలి. డయల్ 112 అయితే మిస్డ్ కాల్ ఇచ్చినా సరిపోతుంది. దిశ యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్ నంబర్లు, సమీపంలోని పోలీస్‌స్టేషన్ వివరాలు తెలుసుకునేందుకు ఆప్షన్లు ఉంటాయి. వైద్య సేవలు అవసరమైనప్పుడు యాప్ ద్వారా దగ్గర్లోని ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులు, ఫార్మసీల వివరాలను కూడా తెలుసుకోవచ్చు.