IPL Auction 2025 Live

Android 11 Update: ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ అందుకునే ఫోన్ల జాబితా ఇదే, మోటోరోలా నుంచి 22 ఫోన్లు, లెనోవో నుంచి ఇక ఫోన్. 2021లో ఆండ్రాయిడ్ 11 మార్కెట్లోకి వచ్చే అవకాశం

ఇందులో భాగంగానే మోటరోలా సరికొత్త ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను అందుకోబోయే ఫోన్‌ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను (Android 11 Update) అందుకునే 22 మోటరోలా మొబైల్స్, ఒక లెనోవా మొబైల్ ఉంది.

Android 11 Update (photo-PTI)

టెక్నాలజీ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఆండ్రాయిడ్ వర్షన్ (Android Version) రోజు రోజుకు సరికొత్తగా ముందుకు వస్తోంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ 10 మార్కెట్లోకి రాగా తాజాగా ఆండ్రాయిడ్ 11 కూడా మార్కెట్లోకి దిగింది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ 11 కొన్ని ఫోన్లకు అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగానే మోటరోలా సరికొత్త ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను అందుకోబోయే ఫోన్‌ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను (Android 11 Update) అందుకునే 22 మోటరోలా మొబైల్స్, ఒక లెనోవా మొబైల్ ఉంది.

అయితే సరిగ్గా ఎప్పుడు తీసుకువస్తారో అనే విషయం కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ జాబితాలో మోటరోలా రేజర్ 5జీ, మోటరోలా రేజర్ 2019, మోటరోలా ఎడ్జ్, మోటరోలా ఎడ్జ్ ప్లస్, మోటరోలా వన్ 5జీ, మోటరోలా వన్ యాక్షన్, మోటరోలా వన్ ఫ్యూజన్, మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్, మోటరోలా వన్ హైపర్, మోటరోలా వన్ విజన్, మోటో జీ 5జీ, మోటో జీ 5జీ ప్లస్, మోటో జీ 5జీ ఫాస్ట్, మోటో జీ పవర్, మోటో జీ ప్రో, మోటో జీ స్టైలస్, మోటో జీ9, మోటో జీ 9ప్లే, మోటో జీ 9ప్లస్, మోటో జీ 9పవర్, మోటో జీ8, మోటో జీ 8పవర్, లెనోవా కే 12నోట్ ఉన్నాయి.

దేశంలో తొలి 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ హైదరాబాద్‌లోనే.. చైనా తర్వాత ఇండియాలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఒప్పో, మరో మూడు ఫంక్షనల్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు కోసం ప్రయత్నాలు

అయితే ఈ అప్‌డేట్ 2021లో రానున్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ లో భాగంగా చాట్ బబుల్స్, డివైస్ కంట్రోల్స్ ఫీచర్ రానుంది. దీంతోపాటు ప్రైవసీ సెట్టింగ్స్‌ను కూడా మెరుగుపరుచుకోవచ్చు. మైక్, కెమెరా, లొకేషన్ వంటి వాటికి వన్ టైం పర్మిషన్లను అందించవచ్చు