Avast Warning: వెంటనే ఈ 7 యాప్స్ మీ మొబైల్ నుంచి డిలీట్ చేయండి, వినియోగదారులను హెచ్చరించిన ప్రముఖ డిజిటల్ సెక్యూరిటీ దిగ్గజం అవాస్ట్
డిజిటల్ సెక్యూరిటీ దిగ్గజం ‘అవాస్ట్’ గేమర్స్‌ని టార్గెట్ చేస్తున్న 7 యాప్స్‌ని గుర్తించి లిస్ట్ (Avast Warning) బయటపెట్టింది. కాగా మైన్‌క్రాఫ్ట్ వీడియో గేమ్ అభిమానులనే ఈ యాప్స్ (Malicious mobile apps) ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయి. ఫ్లీస్‌వేర్ అప్లికేషన్స్ యూజర్లకు వాల్‌పేపర్స్, మాడిఫికేషన్స్ లాంటివి ఎర వేసి డబ్బులు కాజేస్తున్నాయి.
డిజిటల్ సెక్యూరిటీ దిగ్గజం ‘అవాస్ట్’ గేమర్స్‌ని టార్గెట్ చేస్తున్న 7 యాప్స్‌ని గుర్తించి లిస్ట్ (Avast Warning) బయటపెట్టింది. కాగా మైన్‌క్రాఫ్ట్ వీడియో గేమ్ అభిమానులనే ఈ యాప్స్ (Malicious mobile apps) ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయి. ఫ్లీస్‌వేర్ అప్లికేషన్స్ యూజర్లకు వాల్‌పేపర్స్, మాడిఫికేషన్స్ లాంటివి ఎర వేసి డబ్బులు కాజేస్తున్నాయి. ప్రతి నెల ఇలా వినియోగదారుల నుండి పెద్ద మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇలా తమ వినియోగదారుల నుండి డబ్బులు కాజేస్తున్న 7 యాప్స్‌ని అవాస్ట్ గుర్తించింది . అందుకే వీటిని డౌన్లోడ్ చేసుకోవద్దని, ఒక వేల డౌన్‌లోడ్ చేసుకుంటే వెంటనే వీటిని మొబైల్ నుండి తొలగించాలని పేర్కొంది.
హానికరమైన మొబైల్ అనువర్తనాలు అనేక రూపాల్లో రావచ్చు. కొన్ని iOS లేదా Android అనువర్తనాలు ట్రోజన్ కోడ్‌ను పొందుపరచవచ్చు మరియు మీ ఆన్‌లైన్ ఆధారాలను దొంగిలించడానికి వేచి ఉండవచ్చు; కాల్స్, మెసేజ్ లాగ్స్, జిపిఎస్ డేటా మరియు ఆన్‌లైన్ కార్యాచరణను పర్యవేక్షించగలవు కాబట్టి ఇతరులు స్పైవేర్‌గా పరిగణించబడతారు; అయితే ఆపరేటర్లకు మోసపూరిత ఆదాయాన్ని సంపాదించడానికి రూపొందించిన పాప్-అప్ ప్రకటనలతో వినియోగదారులను ఈ హ్యాకింగ్ చాలా ప్రమాదంలోకి నెట్టివేయబడతాయి.
ఈ రకమైన యాప్ లను అన్‌ఇన్‌స్టాల్ చేయడం మాత్రమే సరిపోదు. సభ్యత్వాన్ని రద్దు చేయాలని గుర్తుంచుకోవాలి. అలా చేయడానికి, Google Play Store యొక్క మెనూకు వెళ్లి, వాటిని పూర్తిగా తొలగించడానికి "Subscriptions" టాబ్‌కు నావిగేట్ చేయండి.
7 యాప్స్ జాబితా ఇదే
Skins, Mods, Maps for Minecraft PE
Skins for Roblox
Live Wallpapers HD & 3D Background
MasterCraft for Minecraft
Master for Minecraft
Boys and Girls Skins
Maps Skins and Mods for Minecraft
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)